పూలమ్మితే, పాలమ్మితే వందల కోట్లు వస్తాయా..? : సీఎం రేవంత్
Published on: Sat Sep 12, 2026 4:47PM
.webp)
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 7, 2023 నాటికి రాష్ట్రంలో బ్యాంకు అప్పులు ఏకంగా రూ. 8,11,000 కోట్లకు చేరడమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేలా రూ. 5,435 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను మిగిల్చిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల చదువుల కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని కూడా గత పాలకులు రాజకీయ క్రీడగా మార్చడం అత్యంత బాధాకరం.ఫీజుల బకాయిలు.. బ్లాక్‌మెయిల్ రాజకీయాలుగత ప్రభుత్వ హయాంలో ఆన్‌లైన్ వివరాలు పారదర్శకంగా లేకపోవడం వల్ల కొద్దిమంది కాలేజీల నిర్వాహకులు భారీగా గోల్‌మాల్‌కు పాల్పడ్డారు.
విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి, కొన్ని కాలేజీలు చేసిన ఫ్రాడ్స్‌ను అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తెరలేపారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలను అడ్డుపెట్టుకుని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను తమవైపునకు తిప్పుకునేందుకు ఈ వ్యవస్థను దుర్వినియోగం చేశారని సీఎం మండిపడ్డారు. ఆనాడు కష్టపడి చదువుకుంటున్న విద్యార్థులకు అందాల్సిన ఫీజు బకాయిలను విస్మరించి, అధికారంలో ఉన్న నాయకుల విద్యాసంస్థలకే నిధులు మళ్లించుకున్న దుస్థితి నెలకొంది. సిబిఐటి, వాసవి, మాతృశ్రీ లాంటి పేరున్న ప్రతిష్టాత్మక కాలేజీలకు మొండిచెయ్యి చూపడం విద్యార్థులకు జరిగిన ఘోరమైన అన్యాయం.పేద విద్యార్థుల ఉసురు తగులుతుందిగతంలో ఫీజులు రాకపోయినా, అర్హులైన విద్యార్థులు మరియు యాజమాన్యాలు ఒక్కరోజు కూడా నోరు తెరిచి మాట్లాడే సాహసం చేయలేకపోయాయి.

ధర్నాలు లేవు, ఆందోళనలు లేవు.. కారణం ఏంటి? గత ప్రభుత్వ అధినేత కక్షసాధింపు చర్యలకు భయపడి అంతా మౌనంగా క్షోభ అనుభవించారు. నేడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల మేలు కోసమే గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడమే కాకుండా, పారదర్శకత కోసం 'ఫేషియల్ రికగ్నిషన్' విధానాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి కళాశాలకు వెళ్లాల్సిందేనని, నిజాయితీగా నడుచుకునే జెన్యూన్ కాలేజీలన్నింటికీ ఎలాంటి జాప్యం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తామని భరోసా ఇచ్చారు. కానీ, ప్రజల సొమ్మును దోచుకునే నకిలీ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమని హెచ్చరించారు.ప్రైవేట్ యూనివర్సిటీల్లో వేల కోట్ల సర్ప్లస్! సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలోని ప్రైవేట్ యూనివర్సిటీలను తనిఖీ చేయగా వెలుగు చూసిన నిజాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి.
కేవలం ఒక యూనివర్సిటీ ఖాతాలను పరిశీలిస్తే, ఏకంగా రూ. 400 కోట్ల సర్ప్లస్ క్యాష్ ఉండటం విస్తుగొలుపుతోంది. ప్రభుత్వంలో దోచుకున్న సొమ్మా? లేక పేద విద్యార్థుల నుంచి వసూలు చేసిన డొనేషన్ల సొమ్మా? అంటూ సీఎం ప్రశ్నించారు. "పూలమ్మితే, పాలమ్మితే వందల, వేల కోట్లు వస్తాయా?" అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా ధనాన్ని, విద్యార్థుల భవిష్యత్తును కొల్లగొట్టిన వారి ఆటలు ఇక చెల్లవని, ప్రతి రూపాయికి లెక్క తేలుస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల కన్నీళ్లను తుడిచే నిజమైన సంక్షేమ పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.
[ CM Revanth Reddy On Reimbursement, Assembly Speech, KCR Government Debts, Student Fee Dues TS, Vigilance Report Telangana, MLA Mallareddy, CMR, Mallareddy Universities, Telugu One, Telugu News]


