నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.!
Published on: Thu Nov 12, 2026 2:23PM
.webp)
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి.. గతంలో నమోదైన కేసుల విచారణలో భాగంగా న్యాయస్థానానికి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఆయన హాజరు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కరోనా నిబంధనల ఉల్లంఘనతో పాటు, ఎన్నికల సమయంలో నమోదైన పాత కేసులు ఈ విచారణకు కారణమయ్యాయి.
కరోనా నిబంధనల ఉల్లంఘన కేసు.!
2021లో దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రంగా విజృంభించింది. ఆ సమయంలో ఎన్నికల ప్రచార సభలు, రాజకీయ సమావేశాలపై కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాల్గొన్న ఓ రాజకీయ కార్యక్రమంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటి ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. 2021లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో చోటుచేసుకున్న ఘటన ఈ కేసుకు కారణమైంది.
ఉప ఎన్నికల ప్రచారంలోనే వివాదంనాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో 2021లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంపై కొవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: కేవలం రూ.100 పెట్టుబడి..కోటి రూపాయల వ్యాపారం సామ్రాజ్యంగా ఎదిగిన రైతు సక్సెస్ స్టోరీ.!
2021లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంస్తోంది. అదే సమయంలో 2021 ఏప్రిల్ 11న నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ప్రచార సమయంలో మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రేవంత్ రెడ్డితో పాటు ఇతరులపై కేసు నమోదైంది.
2019 హుజూర్నగర్ ఉపఎన్నికల కేసులు కూడా.!
మరోవైపు, 2019 హుజూర్నగర్ ఉపఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించడం ద్వారా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని, అనుమతులకు మించి వాహనాలు, కార్యకర్తలు పాల్గొన్నారని ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులు కూడా న్యాయస్థానంలో విచారణ దశలో ఉన్నాయి.
సీఆర్పీసీ 313 ప్రకారం వాంగ్మూలం.!
క్రిమినల్ కేసుల విచారణలో సీఆర్పీసీ సెక్షన్ 313 ప్రకారం నిందితుల వివరణ తీసుకోవడం కీలక ప్రక్రియ. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న అంశాలపై నిందితులు వివరణ ఇచ్చే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది. ఈ ప్రక్రియలో నిందితుల వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది.

అయితే, ఈ దశలో వాంగ్మూలం నమోదు చేసినంత మాత్రాన నేరం నిరూపితమైనట్లు కాదు. సాక్ష్యాధారాలు, ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన తర్వాతే న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకుంటుంది.గతంలో నమోదైన కేసులు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హోదాలో ఉన్న వ్యక్తిని కోర్టు విచారణకు తీసుకురావడంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.
మీకు నచ్చవచ్చు: రూ.7 కోట్లు ఇవ్వాలి.. లేదంటే చంపేస్తాం.. కేజ్రీవాల్‌కు హత్య బెదిరింపులు.!
CM Revanth Reddy appears in Nampally court!, Nampally Court, Covid Rules Violation, Covid Case, 2021 By-Elections, Nagarjuna Sagar By-Election, CM Revanth Reddy


