TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ సీఎం రేవంత్ కు బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ పురస్కారం: అందజేస్తున్నదెవరంటే.?

Published on: Fri Sep 25, 2026 10:16AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి   జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అమలు చేస్తున్న  ప్రజా సంక్షేమ పథకాలు, పరిపాలనా విధానాలకు గాను ఆర్యడన్ ముహమ్మద్ 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ పురస్కారానికి రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. 

కేరళకు చెందిన   కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్యడన్ ముహమ్మద్ జ్ఞాపకార్థం ఆర్యడన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఏటా బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ పురస్కారం అందిస్తున్నది. ఈ ప్రతిష్ఘాత్మక పురస్కారాన్ని 2026 సంవత్సరానికి రేవంత్ కు అందజేయనున్నారు. ఈ మేరకు ఆ ఫౌండేషన్ అధికారికంగా ప్రకటించింది.

 రైతాంగం, సామాన్య ప్రజలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం సీఎం రేవంత్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, ఆయన నాయకత్వ లక్షణాల ఆధారంగా జ్యూరీ రేవంత్ ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం (సెప్టెంబర్ 5) కేరళలోని నీలాంబూర్ వేదికగా రేవంత్ రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకుంటారు.  ఈ అవార్డు కింద నిర్వాహకులు లక్ష రూపాయల నగదు బహుమతితో పాటు ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు.  


[CM Revanth Reddy, Best Public Servant Award, Aryadan Muhammed Foundation, Telangana News, Nilambur Kerala, Telugu One]