TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డీఎస్సీ ఆరోపణలపై దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించండి.. వైసీపీకి చంద్రబాబు సవాల్!

Published on: Mon Sep 21, 2026 3:20PM

మెగా డీఎస్సీ నిర్వహణ, నియామకాలపై వైసీపీ ఆ ఆరోపణలతో  ఏపీలో రాజకీయం హీటెక్కింది.  కుప్పంలో సోమవారం ( సెప్టెంబర్ 21) నిర్వహించిన   భారీ బహిరంగ సభలో  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్  సవాల్ విసిరారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంగా చేపట్టిన మెగా డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.  డీఎస్సీకి అసలైన చిరునామా చంద్రబాబు,  తెలుగుదేశం పార్టీయేనని స్పష్టం చేశారు.   తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో  16 వేలకు పైగా   ఉద్యోగాలను విజయవంతంగా భర్తీ చేశామన్న ఆయన.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా ఇది 17వ సంవత్సరమని, తాను నిర్వహించిన ఏ ఒక్క డీఎస్సీలోనూ ఎటువంటి అవకతవకలకు, అక్రమాలకు తావులేదని   కుండబద్దలు కొట్టారు.

వైసీపీకి దమ్ము, ధైర్యం   రోడ్ల మీద విమర్శలు చేయడం మాని నేరుగా అసెంబ్లీకి రావాలని..  తమ వద్ద ఉన్న  సాక్ష్యాధారాలతో వారి ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఒకవేళ అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్నారు. అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరైతే..  డీఎస్సీపై ఆ పార్టీ  బండారాన్ని, అక్రమాలను ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు బయటపెడతామన్నారు.  వైసీపీ  హయాంలో జరిగిన జే-బ్రాండ్స్ మద్యం అక్రమాలు, ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీలో జరిగిన ఘోరాలు, అవినీతి బాగోతాలపై సమాధానం చెప్పే సత్తా ప్రతిపక్ష నేతలకు ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు.  తెలుగుదేశం కూటమి రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెడుతోందనీ, దానిని  ఓర్వలేకనే వైసీపీ ఈ రకంగా  దుష్ప్రచారాలకు తెరలేపుతున్నదని విమర్శించారు. 

సమాజానికి మార్గదర్శకులుగా నిలిచి విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడటం   హేయమన్నారు.  మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించే ఆ పార్టీ అసలు సిసలు  గొడ్డలి పార్టీ అన్నారు.   తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో అవినీతికి, అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఉండదని, చేతకాని విమర్శలు మాని దమ్ముంటే సభకు వచ్చి చర్చించాలని ప్రతిపక్ష నాయకులకు చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.


[CM Chandrababu Naidu, Mega DSC Controversy, Chandrababu Challenge, AP Assembly, ycp Allegations, Andhra Pradesh Politics, Telugu One]