Latest News
ఫైళ్ల క్లియరెన్స్‌పై మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్
posted on: Mar 12, 2026 11:20AM
.webp)
పాలనలో వేగం పెంచే లక్ష్యంతో మంత్రుల ఫైళ్ల క్లియరెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేటింగ్స్ ప్రకటించారు. కలెక్టర్ల సమావేశంలో మంత్రుల పనితీరును విశ్లేషిస్తూ, ఎవరు ఎంత వేగంగా ఫైళ్లను పరిష్కరిస్తున్నారో గణాంకాలతో సహా వివరించారు.
ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ నిలిచారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు.
మరోవైపు, హోంమంత్రి వంగలపూడి అనిత ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో చివరి స్థానంలో ఉండటం గమనార్హంగా మారింది. మంత్రులు ఫైళ్లను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత సమయంలోగా క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పరిపాలనలో వేగం ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, కలెక్టర్ల సమావేశం రెండో రోజు కూడా పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ప్రత్యేక ప్రజెంటేషన్, రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాలపై సమీక్ష జరగనుంది. విద్యా రంగంలో మార్పులు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై కూడా చర్చించనున్నారు. సాయంత్రం కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, చట్ట వ్యవస్థ బలోపేతంపై కీలక దిశానిర్దేశం చేయనున్నారు.


.webp)
.webp)


