సీఈసీపై బొద్దింకల దాడి: జ్ణానేశ్వర్ ను టార్గెట్ చేసిన సీజేపీ.!
Published on: Thu Sep 24, 2026 8:41AM

దేశంలో ఎన్నికల నిర్వహణ తీరు, ఈవీఎంల పనితీరు, ఓటర్ల జాబితాల సవరణ వంటి అంశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైన ఎన్నికల సంఘం పని తీరు వివాదాస్పదంగా ఉందనీ, నిష్పాక్షిత, పారదర్శకత కరవైందనీ కాంగ్రెస్ సహా ఎన్డీయేతర పార్టీలు విమర్శిస్తున్నాయి.
ముఖ్యంగా, ఎస్ఐఆర్ అంటూ పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు పట్ల దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతోంది. మరీ ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహార శైలిపై సర్వత్రా వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
సరిగ్గా ఇదే సమయంలో బొద్దింకల పార్టీ.. కాక్రోచ్ జనతా పార్టీ.. సీఈసీని టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే సామాజిక మాధ్యమ వేదికగా షేర్ చేసిన పోస్టులో గురువారం (సెప్టెంబర్ 24) హస్తినలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
.webp)
ఆ పోస్టులో ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేయలని పేర్కొంటూ.. సీఈసీని ఉద్దేశించి జ్ణానేష్ నీ పని ఫినిష్ భాయ్ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ ప్రకటన ద్వారా కాక్రోచ్ జనతా పార్టీ సీఈసీ టార్గెట్ గా ఉద్యమానికి తెర లేపిందని అవగతమౌతోంది. ఇక గురువారం (సెప్టెంబర్ 24) ప్రెస్ మీట్‌లో ఎన్నికల ప్రక్రియ లోపాలను ఎండగట్టడమూ కాకుండా, ఈసీ వ్యవస్థ పనితీరుపై, సీఈసీ వ్యవహార శైలిపై సీజేపీ సంచలన విషయాలు వెల్లడించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విధానాలకు వ్యతిరేకంగా సీజేపీ ఆందోళన.. ఆయన పదవికి రాజీనామా చేసేలా చేసిన సంగతి తెలిసిందే. అటువంటి సీజేపీ ఇప్పుడు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై సమరశంఖం పూరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
.webp)
ఎన్నికల సంఘం సంస్థాగత పారదర్శకతపై విపక్షాలు, స్వతంత్ర సంస్థలు ఇప్పటికే ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తూ, ఆందోళన బాట పట్టాయి. ఓటర్ల జాబితాల రూపకల్పన, ఈవీఎంల విశ్వసనీయతపై చాలా కాలంగా అనుమానాలూ, సందేహాలూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సు తరుణంలో సీఈసీని టార్గెట్ చేస్తూ బొద్దింకల పార్టీ సమరభేరి మోగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బొద్దింకల పార్టీ డిజిటల్ వేదికలపైనే కాకుండా, క్షేత్రస్థాయిలోనూ ఉద్యమాలకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.
[CJP, Election Commissioner Gyanesh Kumar, Cockroach Janata Party, Abhijeet Dipke, Election Commission of India,Telugu One]


