TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ ఫార్మా రంగంలో పెట్టుబడులకు భారీ అవకాశాలు: పారిశ్రామికవేత్తలకు లోకేష్ ఆహ్వానం.!

Published on: Fri Sep 25, 2026 9:46PM

ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మా పరిశ్రమలను మరింత అభివృద్ధి చేసి, పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఫార్మా రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆయన కోరారు. పరిశ్రమలను ఒకే ప్రాంతంలో క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తున్నామని, వ్యాపారాలకు త్వరగా అనుమతులు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పెట్టుబ డులను ఆకర్షించే లక్ష్యంతో సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2026–ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్‌లో ఫార్మా రంగంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొని ఏపీలో ఫార్మా పరిశ్రమలకు ఉన్న అవకాశాలను వివరించారు. ఫార్మా మందుల తయారీ, ఔషధాల ఎగుమతులు, పరిశోధన–అభివృద్ధి, మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు వంటి అన్ని అంశాలను కలిపి ఏపీని ఫార్మా రంగంలో కీలక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

2030 నాటికి భారత ఫార్మా మార్కెట్ 130 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రపంచ ఫార్మా ఉత్పత్తుల సరఫరాలో భారతదేశానికి 20 శాతం వాటా ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఫార్మా మార్కెట్ విలువ 60 బిలియన్ డాలర్లుగా ఉందని చెప్పారు.అలాగే 2030 నాటికి పేటెంట్ గడువు ముగియనున్న ఔషధాల విలువ 251 బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపారు. 11.05 బిలియన్ డాలర్ల విలువతో ఆంధ్రప్రదేశ్ దేశంలోని టాప్-5 ఫార్మా రాష్ట్రాల్లో ఉందన్నారు. దేశంలో ఔషధాల ఎగుమతుల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని వివరించారు.రాష్ట్రంలో ఫార్మా పరిశ్రమలను ఒకే ప్రాంతంలో సమూహంగా అభివృద్ధి చేసేందుకు క్లస్టర్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం ప్రాంతాల్లో నాలుగు ఫార్మాస్యూటికల్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

విశాఖపట్నంలో దేశంలోని ప్రముఖ మెడికల్ టెక్నాలజీ పార్క్ ఏఎంటీజడ్ (AMTZ) ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6 ఆపరేషనల్ పోర్టులు ఉండగా, మరో 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ సదుపాయాలు ఫార్మా పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు.అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.నక్కపల్లి వద్ద 2,000 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ తొలి దశ పూర్తయిందని తెలిపారు. ఇక్కడ పరిశ్రమలకు అవసరమైన విస్తారమైన భూమి, పోర్టులకు అనుసంధానం, తక్కువ నిర్వహణ ఖర్చులు, ఇప్పటికే ఉన్న ఫార్మా పరిశ్రమల వాతావరణం వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు.అంతేకాకుండా ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం, పెట్టుబడులకు రాయితీలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. 

ఈ అవకాశాలను ఉపయోగించుకుని నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టాలని ఫార్మా కంపెనీల ప్రతినిధులను మంత్రి కోరారు.ఈ సమావేశంలో సాగా లైఫ్ సైన్సెస్ డైరెక్టర్, ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఏ) నేషనల్ ప్రెసిడెంట్ విరంచి షా, జైడస్ గ్రూప్ సీనియర్ లీడర్ డా. గణేష్ నాయక్, స్వర్ణిమ్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ రిషబ్ గయప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఆది రిషబ్ జైన్, క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ ఛైర్మన్ డా. రాజీవ్ ఆర్. మోదీ, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ ప్రెసిడెంట్ డా. దీపక్ గోండాలియా, జైడస్ ఫార్మేజ్ సీనియర్ ప్రొఫెషనల్ కపిల్ రజనీకాంత్ ఆచార్య, స్వర్ణిమ్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ డైరెక్టర్ జనరల్ డా. రాగిన్ షా, స్టాలియన్ లేబరేటరీస్ ప్రతినిధి హితేష్ ఆచార్య, నేహ లైఫ్ సైన్సెస్ ప్రతినిధి జతిన్ గాంధీ, సీఎస్ఐఆర్–సీఎస్ఎంసీఆర్ఐ (CSIR–CSMCRI) సీనియర్ సైంటిస్టులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

[ CII Partnership Summit 2026, Nara Lokesh, Ahmedabad, Bulk Drug Park,  AP Investments, Pharmaceutical Industry, Pharma Investments, Gujarat Investors, Anakapalle District Nakkapalle,Telugu One, Telugu News ]