TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

Ahmedabad: బల్క్ డ్రగ్ పార్క్ పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం.!

Published on: Fri Sep 25, 2026 5:54PM

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2026 - ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో ఫార్మా రంగంపై అహ్మదాబాద్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రజాప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ గురించి మంత్రి వివరించారు. మంత్రి మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో  పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఫార్మాస్యూటికల్ తయారీ, ఔషధ ఎగుమతులు, ఆర్ అండ్ డీ, మౌలిక వసతులు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు వంటి అన్ని అంశాలను సమన్వయం చేస్తూ భారత ఫార్మా రంగ అభివృద్ధికి ఏపీ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. 2030 నాటికి భారత ఫార్మా మార్కెట్ 130 బిలియన్ డాలర్ల దిశగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏపీ భారతదేశంలో 3వ అతిపెద్ద ఔషధ ఎగుమతిదారుగా ఉంది. ప్రపంచ ఫార్మసీ మార్కెట్ విలువ 60 బిలియన్ డాలర్లు కాగా.. ప్రపంచ సరఫరాలో భారతదేశ వాటా 20%గా ఉంది. 2030 నాటికి పేటెంట్ గడువు ముగియనున్న ఔషధాల విలువ 251 బిలియన్ డాలర్లుగా ఉంది. 11.05 బిలియన్ డాలర్ల విలువతో భారతదేశ టాప్-5 ఫార్మా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 

 బల్క్ డ్రగ్ పార్క్ లో పెట్టుబడులకు ఆహ్వానం..!

అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం ప్రాంతాల్లో 4 ఫార్మాస్యూటికల్ క్లస్టర్లను అభివృద్ధి చేయడం జరుగుతోంది. విశాఖపట్నం భారతదేశపు ప్రముఖ మెడికల్ టెక్నాలజీ పార్క్ ఏఎంటీజడ్ (AMTZ) కు కేంద్రంగా ఉంది. 6 ఆపరేషనల్ పోర్టులు, 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు ఉన్నాయి. నక్కపల్లి వద్ద 2,000 ఎకరాల బల్క్ డ్రగ్ పార్క్ మొదటి దశ పూర్తైంది. నక్కపల్లి ఫార్మా పార్క్‌కు విస్తారమైన భూమి, పోర్ట్ కనెక్టివిటీ, తక్కువ నిర్వహణ వ్యయాలు, బలమైన ఫార్మా ఎకోసిస్టమ్ ఉన్నాయి. వీటితో పాటు ప్రభుత్వ మద్దతు, పెట్టుబడి రాయితీలు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. అన్ని అనుకూలతలు ఉన్న బల్క్ డ్రగ్ పార్క్ లో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు మంత్రి పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సాగా లైఫ్ సైన్సెస్ లి.(Saga Lifesciences) డైరెక్టర్, ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(ఐడీఎంఏ) నేషనల్ ప్రెసిడెంట్ విరంచి షా, జైడస్ గ్రూప్ సీనియర్ లీడర్ డా.గణేష్ నాయక్, స్వర్ణిమ్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ (Swarrnim Startup & Innovation University) ప్రెసిడెంట్ రిషబ్ గయప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఆది రిషబ్ జైన్, క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ ఛైర్మన్ డా.రాజీవ్ ఆర్.మోదీ, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ ప్రెసిడెంట్ డా.దీపక్ గోండాలియా, జైడస్ ఫార్మేజ్ సీనియర్ ప్రొఫెషనల్ కపిల్ రజనీకాంత్ ఆచార్య, స్వర్ణిమ్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ డైరెక్టర్ జనరల్ డా.రాగిన్ షా, స్టాలియన్ లేబరేటరీస్ ప్రతినిధి హితేష్ ఆచార్య, నేహ లైఫ్ సైన్సెస్ ప్రతినిధి జతిన్ గాంధీ, సీఎస్ఐఆర్-సీఎస్ఎంసీఆర్ఐ (CSIR–CSMCRI) సీనియర్ సైంటిస్ట్ లు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

[ CII Partnership Summit 2026, Nara Lokesh, Ahmedabad, Bulk Drug Park,  AP Investments, Pharmaceutical Industry, Pharma Investments, Gujarat Investors, Anakapalle District Nakkapalle,Telugu One, Telugu News ]