క్లోరోక్విన్ టాబ్లెట్ వేసుకున్న చిన్నారి మృతి.. పలువురికి అస్వస్థత.!
Published on: Wed Sep 2, 2026 9:34AM

పోలవరం జిల్లా, ఏటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో మలేరియా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆరోగ్య శాఖ సిబ్బంది మొత్తం 71 మందికి క్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేశారు. అయితే ఈ మాత్రలు వేసుకున్న కొద్దిసేపటికే పలువురుర పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో జమున ఆనే ఏడేళ్ల చిన్నారి మరణించింది. అస్వస్థతకు గురైన పిల్లలలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి, 24 మందిని లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవవాలనీ ఆదేశించారు. ఈ ఘటనపై పోలవరం జిల్లా కలెక్టర్ తో సీఎం నేరుగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన పిల్లలకు మరింత మెరుగైన వైద్య సాయం అందించేందుకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తొమ్మిది మంది నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం గొల్లగుప్ప గ్రామానికి చేరుకుంది. అలాగే విజయవాడ, రాజమండ్రి నగరాల నుంచి కూడా వైద్య బృందాలు కూడా గొల్లగుప్ప గ్రామానికి చేరుకున్నాయి. . ఔషధాల నాణ్యత లోపం వల్ల ఈ ఘటన జరిగిందా, డోసేజ్ ఎక్కవ అవ్వడం వల్లనా అన్న దిశగా విచారణ చేపట్లారు.
[Chloroquine Reaction One Kid Died, Gollaguppa Incident, Chandrababu Naidu Inquiry, Polavaram Health Tragedy, AP Health Department, Telugu One]


