TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చీరాల మునిసిపోల్ ఫలితాలు: సోదిలో కూడా కనిపించని వైసీపీ.!

Published on: Fri Nov 6, 2026 3:13PM

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో   కాంగ్రెస్ ఖాతా తెరిచింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల ఫలితాలను ప్రకటించారు. తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 

మరి కొన్నింటిలో ఆధిక్యంలో ఉంది.  చీరాల మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలలో   వైసీపీ సోదిలోకి కూడా కనిపించలేదు. అనూహ్యంగా అక్కడ తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఫలితాలు వెలువడ్డాయి. చీరాల మునిసిపాలిటీ ఎన్నికలలో ప్రధానంగా తెలుగుదేశం కూటమితో కాంగ్రెస్ హోరాహోరీ తలపడింది. ఇక్కడ వైపీపీ మూడో స్థానానికే పరిమితమైంది. 

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య  శుక్రవారం ప్రారంభించారు.    చీరాల మున్సిపాలిటీలో  తెలుగుదేశం అభ్యర్థులు ముందంజలో ఉండగా, రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. పలు వార్డులలో తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చింది. అయితే వైసీపీ మాత్రం కనీస పోటీ ఇవ్వలేక చతికిల బడింది. చీరాల మునిసిపాలిటీలో పలు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చారు. 

గతంలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన రాజకీయ పరిణామాలు, స్థానిక సమీకరణాల ప్రభావం ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చీరాలలో ఆమంచి కృష్ణ ప్రసాద్ కు ఉన్న పట్టు కాంగ్రెస్ కు లాభించిందని అంటున్నారు. 2024 ఎన్నికల ముందు వైసీపీ నుంచి ఆమంచి కాంగ్రెస్ లో చేరారు. కాగా.. 2024 ఎన్నికల్లోనూ చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి 41,859ఓట్లు దక్కించుకున్నారు. మూడో స్థానంలో నిలిచారు. 

ఇది కూడా చదవండి:  ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.!

ఆమంచికి చీరాలలో ఉన్న పట్టు వైసీపీకి మైనస్ గా మారింది. చీరాలలోని ఒక్క వార్డులో కూడా వైసీపీ అభ్యర్థి కనీసం రెండో స్దానానికి చేరుకోలేకపోయారు. ఇక కాంగ్రెస్ విజయం సాధించిన 25వ వార్డులో వైసీపీ బాగా వెనుక బడింది. 

 

చీరాల మున్సిపాలిటీలోని మెజారిటీ వార్డులను కైవసం చేసుకుంటూ తెలుగుదేశం కూటమి ముందంజలో దూసుకుపోతోంది.  మున్సిపల్ చైర్మన్  ఓటింగ్‌లోనూ తెలుగుదేశం అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యతలో ఉన్నారు. మొత్తంగా కడపటి సమాచారం అందే సరికి చీరాలలో ఎనిమిది  వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే చీరాలలో ఆ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉంది.  

మీకు నచ్చవచ్చు: 

[Chirala Municipal Election, Congress, Ahead Ycp,  Competition TDP Versus Congress, Andhra Pradesh Politics, Amanchi Krishna Mohan, Effect, Telugu One]