చీరాల మునిసిపల్ ఓట్ల లెక్కింపు 6కు వాయిదా: భారీ వర్షాలు, ఈదురుగాలులే కారణం.!
Published on: Tue Nov 3, 2026 2:24PM

మురసు తుఫాన్ ప్రభావంతో చీరాల మున్సిపల్ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. బాపట్ల జిల్లా చీరాల ప్రాంతంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తుఫాన్ కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఓట్ల లెక్కింపు నిర్వహించడం సాధ్యం కాదని భావించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

దీంతో కౌంటింగ్‌ను ఈ నెల 6కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో చీరాల మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం నవంబర్ 6 వరకు వేచి చూడక తప్పదు.
[Chirala Counting Postpone, Murasu, Cyclone, Heavy Rains, Wild, Winds, November 6th, Telugu One]


