రెండేళ్లుగా బంగ్లా జైల్లోనే హిందూ సాధువు.. తల్లి అంత్యక్రియలకు సైతం అనుమతించకుండా వేధింపులు.!
Published on: Sun Sep 13, 2026 9:57AM

బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణ కోసం నిలబడిన ఇస్కాన్ సన్యాసి, హిందూ సాధువు చిన్మయ కృష్ణదాస్ దాదాపు రెండేళ్లుగా అక్రమంగా నిర్బంధంలో ఉన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ప్రశ్నించిన కారణంగానే ఆయనపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో నిర్బంధించారు.
మొహమ్మద్ యూనస్ పరిపాలనా కాలంలో 2024లో ఆయనను అరెస్ట్ చేశారు. నాటి నుంచి ఆయనపై అరడజనుకు పైగాద తప్పుడు కేసులు మోపి, విడుదల కాకుండా అన్ని రకాల కుట్రలు చేస్తున్నారు. కొన్ని కేసులలో బెయిల్ లభించినప్పటికీ, మరి కొన్ని కేసుల్లో ఉద్దేశపూర్వకంగా బెయిల్ రాకుండా అడ్డుకుంటూ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది. న్యాయస్థానాల్లో ఎన్నిసార్లు ప్రయత్నించినా బంగ్లాదేశ్ ప్రభుత్వం, పోలీసులు ఆయన్ని బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. మానసిక వేదనకు గురిచేస్తూ జైలులో దయనీయమైన పరిస్థితుల్లో బంగ్లా పాలకులు జైల్లో ఆయనను రాచిరంపాన పెడుతున్నారు. ఒక హిందూ సాధువు ఇన్ని రోజులుగా కటకటాల వెనుక మగ్గుతున్నాఇటు ఇండియా నుంచి కానీ, అటు అంతర్జాతీయ సమాజం నుంచి కానీ గట్టిగా ఖండనలేకపోవడం, సరైన స్పందన లేకపోవడం గమనార్హం.
చిన్మయ కృష్ణదాస్ తల్లి సంధ్యారాణి ధర్ సెప్టెంబర్ 10న కన్నుమూశారు. కొడుకు జైలులో ఉండగానే తల్లి మరణించడం, కనీసం తల్లి అంత్యక్రియలకు కూడా చిన్మయ కృష్ణాదాస్ ను అనుమతించకపోవడం, నిస్సహాయ స్థితిలో చిన్మయకృష్ణదాస్ జైల్లో భోరున విలపిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ దృశ్యాలు చూసిన అందరి కళ్లూ చెమ్మగిల్లాయి.

తల్లినికడసారి చూసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా చిన్మయ కృష్ణదాస్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం వేధించిన తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిన తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో స్పందించి, చిన్మయ కృష్ణదాస్‌పై మోపిన తప్పుడు కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని హిందూ సంఘాలు, మానవ హక్కుల వాదులు డిమాండ్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై, వారికి మద్దతుగా గళమెత్తుతున్న వారిపై అణచివేతకు చిన్మయ కృష్ణాదాస్ ఉదంతం నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు స్పందించి బంగ్లాదేశ్ జైళ్లలో మగ్గుతున్న హిందూ సాధువుల రక్షణకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు అంటున్నారు.
[Chinmoy Krishna Das, Bangladesh Hindu monk, Iskcon monk jailed, Bangladesh crisis, Mohammad Yunus government. Telugu One]


