చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటన.. ఎప్పుడంటే? ఎందుకంటే?
Published on: Sat Aug 22, 2026 10:53AM

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. సౌత్ కరోలినాలో జరిగిన ఓ ర్యాలీలో వేలాది మంది ప్రజల సమక్షంలో ట్రంప్ చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటన విషయాన్ని వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య గత కొంతకాలంగా వాణిజ్య యుద్ధాలు, టారిఫ్‌ల వివాదాలు, టెక్నాలజీ ఆంక్షలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల మే 13 నుండి 15 వరకు డొనాల్డ్ ట్రంప్ చైనాలో 3 రోజులు పర్యటంచిన సంగతి తెలిసిందే.
చైనాలోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్, టెంపుల్ ఆఫ్ హెవెన్ వంటి ప్రదేశాల్లో షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ట్రంప్ చైనా పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలలో ఓ కొత్త అధ్యాయానికి ప్రారంభంగా అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు.
ఆ సందర్భంగా ట్రంప్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ను అమెరికా పర్యటనకు రావలసిందిగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని పురస్కరించుకుని జన్ పింగ్ మరో రెండు వారాలలో అమెరికార పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో అమెరికా, చైనా అధ్యక్షుల మధ్య ముఖాముఖీ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ చర్చలలో గ్లోబల్ ట్రేడ్ రీసెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , సెమికండక్టర్ చిప్స్ ఎగుమతులు, గ్లోబల్ మార్కెట్ స్థిరత్వం పైచర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
China President America Tour, Donald Trump, Xi Jinping, Trump Xi News, Global Economy, TeluguOne


