పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం..!
Published on: Thu Aug 27, 2026 10:20AM

రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..!
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం..!
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచే సుకుంది. ఈరోజు గురువారం తెల్లవారు జామున చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మితిమీరిన వేగంతో వచ్చి ఆటో ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు మృతి అక్కడికక్కడే మృతి చెందగా. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రు లను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన బొంతా మంగమ్మ, బొంతా బాబు రావు, బొంతా గంగమ్మ, బొంతా సంపూర్ణమ్మ, బొంతా మరియమ్మ, ఎస్.లక్ష్మమ్మ వీరంతా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
వేలూరు గ్రామానికి చెందిన వీరంతా పుట్టినరోజు వేడుకల కోసం కొండమంజులూ రుకు వెళ్లారు. వేడుకలు ముగించుకుని ఆటోలో తిరిగి వేలూరుకు వస్తుండగా అడ్డరోడ్డు సెంటర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అత్యంత వేగంగా వెళ్లి ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించి గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని చంద్రబాబు సూచించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని వైద్య అధికారులకు సీఎం సూచించారు
Chilakaluripeta Road Accident, Palnadu District News, CM Chandrababu, Naralokesh, Guntur General Hospital, Veluru Village Tragedy, Andhra Pradesh Bus Accident, Telugu news, Telugu one


