Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇండియన్ ఎక్స్ ప్రెస్ శక్తిమంతమైన ఇడియన్స్ జాబితాలో తెలుగు రాష్ట్రాల సీఎంలు!
posted on: Mar 30, 2026 10:23AM
.webp)
దేశంలోని అత్యంత శక్తిమంతుల జాబితాలో టాప్ 100లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చోటు దక్కింది. అంతే కాకుండా ఈ ఇరువురూ కూడా ఆ జాబితాలో తొలి పాతిక స్థానాలలో నిలవడం విశేషం. జాతీయ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ 2026 సంవత్సరానికి దేశంలోనే అత్యంత శక్తిమంతుల జాబితాను ప్రకటించింది. వంద మంది ప్రముఖులతో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ జాబితాలో 13వ స్థానం దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో చూపుతున్న చొరవ చంద్రబాబును టాప్ 100 మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్స్ ఇన్ ఇండియా జాబితాలో 13వ స్థానంలో నిలబెట్టాయి. అలాగే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జాబితాలో 25వ స్థానాన్ని దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తర్వాత అత్యంత ప్రభావశీలుడైన నేతగా రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు దక్కింది. కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రాలను అధిగమించి జాబితాలో రేవంత్ 25వ స్థానాన్ని దక్కిం చుకున్నారు.
ఇక పోతే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చోటుదక్కించుకున్నారు. ఈ జాబితాలో ఆయన 68వ స్థానంలో నిలిచారు. ఇక యువ నేత, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా టాప్ 100లో నిలిచారు. ఈ జాబితాలో ఆయనకు 90వ స్థానం దక్కింది.


.webp)



