TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తప్పు చేస్తే వదిలి పెట్టం: రుజువులు లేకుండా తొలగించం.. సుప్రీం కోర్టు.!

Published on: Mon Oct 5, 2026 3:08PM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ణానేశ్ కుమార్ తప్పు చేసినట్లు నిరూపితమైతే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.  సర్ ప్రక్రియ చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా కోట్ల మంది ఓటు హక్కు కోల్పోవడంపై  పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడం, దేశ వ్యాప్తంగా ఆందోళనలు పెచ్చరిల్లుడం తెలిసిందే. 

ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఫామ్-6 లో కూడా 2002 నాటి ఓటర్ల జాబితాలో తాతలు, తండ్రులు, కుటుంబ సభ్యుల వివరాలను పేర్కొనాలంటూ ఎన్నికల సంఘం నిబంధనలు పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎన్నికల సంఘంలో జ్ఞానేష్ కుమార్ ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.

 

ఈ పిల్ ను విచారించిన సుప్రీం కోర్టు జ్ణానేశ్ తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన తప్పు చేసినట్లు రుజువైతే నిస్సందేహంగా కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు విస్పష్టంగా చెప్పింది. అయితే ఇప్పటికిప్పుుడు ఆయనను తలగించే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే, మీడియా వార్తలను, పేపర్లలో వచ్చే కథనాలను నేరుగా విశ్వసించలేమని, వాటిని అధికారికంగా ధ్రువీకరించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

ఏ వ్యవస్థ అయినా సరే రాజ్యాంగం,  చట్టం ప్రకారం పని చేయాల్సిందేనని తేల్చిచెప్పింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు హక్కుకు భద్రత కల్పించాల్సిన పూర్తి బాధ్యత ఎన్నికల సంఘానిదేనని సుప్రీం కోర్టు కుండబద్దలు కొట్టింది.  ఒకవేళ ఫామ్-6 లో చేసిన మార్పులు వ్యక్తిగతంగా, ఏకపక్షంగా  తీసుకున్న నిర్ణయాలు అయితే, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

అదే సమయంలో..  జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు ఆ పదవి నుంచి తొలగించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంపై జ్ఞానేష్ కుమార్‌కు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మరోవైపు, ఫామ్-6 పై తీవ్ర ఆరోపణలు రావడం, ప్రజల నుంచి వ్యతిరేకత పెరగడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా వెనక్కి తగ్గింది. వివాదాస్పదమైన నిబంధనలను సవరించుకుని, గతంలో ఉన్న మాదిరిగానే ఫామ్-6 ని అనుసరించాలని స్పష్టం చేసింది. 


[Chief Election Commissioner Gyanesh Kumar,  Supreme Court,   Election Commission, Form 6, Voter List, Political News, Telugu One]