చెవిరెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు ఓకే.!
Published on: Tue Sep 1, 2026 10:02AM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో రిలీఫ్ లభించింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన విదేశీ పర్యటనకు విజయవాడలోని ఏసీబీ స్పెషల్ కోర్టు అనుమతి మంజూరు చేసింది. మద్యం కుంభకోణం, లుకౌట్ నోటీసుల నేపథ్యంలో చెవిరెడ్డి ప్రయాణంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ తరుణంలో ఆయన తన విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు విదేశీ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి ఉందని, ప్రయాణ అనుమతి ఇవ్వాలని ఏసీబీ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు.
పిటిషన్ ను విచారించిన కోర్టు, ఆయన అమెరికా పర్యటనకు కాలపరిమితితో కూడిన అనుమతి ఇచ్చింది. పరిమితిని నిర్దేశించింది. కోర్టు ఇచ్చిన అనుమతి మేరకు చెవిరెడ్డి సెప్టెంబర్ 3 నుంచి 13వ తేదీ వరకు అమెరికాలో పర్యటించవచ్చు. అలాగే అమెరికాలో ఆయన బస చేసే చిరునామా, ఫోన్ నంబర్, ఈ మెయిల్ వివరాలను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.
అంతే కాకుండా.. ప్రయాణానికి ముందుగానే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, అవసరమైన సెక్యూరిటీలను కోర్టులో సమర్పించాలలి. అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే తన పాస్‌పోర్టును న్యాయస్థానానికి సరెండర్ చేయాల్సి ఉంటుంది.
[Chevireddy Bhaskar Reddy Gets Relief in Court, Y CP Leader Chevireddy, Vijayawada ACB Court, US Travel Relief, Overseas Travel Permission, Telugu One]


