TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిల్లర కోసం గొడవ: కండక్టర్ ను బస్సులోంచి తోసేసిన మహిళ.!

Published on: Mon Oct 26, 2026 10:40AM

చిల్లర గొడవ ఆర్టీసీ కండక్టర్ ప్రాణాల మీదకు తెచ్చింది. చిల్లర విషయంలో కండక్టర్ తో ఘర్షణ పడిన ఓ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్ ను కదులుతున్న బస్సులోంచి కిందకు తోసేసింది. ఈ ఘటనలో ఆ మహిళా  కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.  మణుగూరు డిపోకు చెందిన టీఎస్‌జీఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో   మణుగూరుకు చెందిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కింది. తన కుమారుడి హాఫ్ టికెట్ కొనుగోలు చేసే క్రమంలో ఆమె కండక్టర్ ప్రవళికకు వంద రూపాయల నోటు ఇచ్చింది.

అయితే ఆ సమయంలో కండక్టర్ వద్ద చిల్లర లేకపోవడంతో..   గమ్యస్థానానికి చేరుకున్నాక చిల్లర తీసుకోవాలని చెప్పారు. అయితే అందుకు అంగీకరించని ఆ మహిళా ప్రయాణీకురాలు కండక్టర్ తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో  అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  

ఆమెను  భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు.  డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కండక్టర్ ను తోసేసిన ప్రయాణీకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  


[Change Dispute Women Commuter Pushes RTC  conductor Grom Bus, Telangana, Khammam district, Aswapuram, Telugu One]