వాటర్ మ్యాన్ సీబీఎన్ కు కలెక్టర్ల సదస్సు స్టాండింగ్ ఒవేషన్.!
Published on: Thu Sep 10, 2026 2:25PM

ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న అమూల్యమైన సేవలను, ఆయన పడుతున్న తపనపై దేశం మొత్తం ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీఎం చంద్రబాబును వాటర్ మ్యాన్ గా అభివర్ణించారు. సాగునీటి రంగంలో ఆయన చేసిన సాహసోపేతమైన కృషిని ఎకనమిక్ టైమ్స్ ప్రత్యేకంగా ప్రశంసిస్తూ కథనం ప్రచురించిన విషయాన్ని చెబుతూ పయ్యావుల కేశవ్ చంద్రబాబును ఎకనామిక్ టైమ్స్ వాటర్ మ్యాన్ గా అభివర్ణించిందని చెప్పగానే.. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న వారంతా చంద్రబాబుకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
రాష్ట్రంలో జల వనరుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెలిగొండ, పోలవరం ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల ప్రక్రియ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదొక సైలంట్ డెవలెప్ మెంట్ అని పయ్యావుల కేశవ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, సంకల్పబలం కు నిలువెత్తు నిదర్శనంగా వెలిగోండ, పోలవరం ఎడమ కాలువల ద్వారా నీటివిడుదల నిలుస్తుందన్నారు.
.webp)
మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నుంచే రాష్ట్రంలోని ప్రతి మూలకు నీరు అందించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని గుర్తు చేసిన పయ్యావుల కేశవ్.. హంద్రీనీవా, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువల ద్వారా ప్రజలకు సమృద్ధిగా నీళ్లు అందుతున్నాయంటే అందుకు చంద్రబాబు దార్శనికత, చిత్తశుద్ధి, కఠోర కృషే కారణమన్నారు.
గతంలో వైసీపీ పట్టిసీమ ప్రాజెక్ట్ తీవ్రంగా వ్యతిరేకించిందనీ, కానీ ఆ పట్టిసీమే కృష్ణాడెల్టాకు వరప్రదాయినిగా మారిందని మంత్రి అన్నారు. పట్టిసీమ ద్వారా ఇప్పటివరకు 500 టీఎంసీల నీటిని తరలించగలిగామనీ.. అదేవిధంగా, ప్రకాశం బ్యారేజీని 200 సార్లు నింపి డెల్టా ప్రాంతంలోని రైతులకు ఎటువంటి సాగునీటి కొరత లేకుండా చేశామని వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం కోసం ముఖ్యమంత్రి నిరంతరం పడుతున్న తపనను దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు గుర్తించారని, ఆయన సాధించిన ఈ ఘనతే నేడు రాష్ట్ర అభివృద్ధికి అసలైన సోపానమని పయ్యావుల కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబును సీఎం కాదు సీఈవో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే వారనీ, ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ ఇచ్చిన వాటర్ మ్యాన్ కితాబు అంత కంటే గొప్పదన్నారు.
[Chandrababu Naidu, Water Man, Economitimes, Payyavula Keshav, AP Irrigation Projects, Pattiseema 500 TMC, AP Collectors Conference, Standing Ovation]


