TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజకీయం అంటే తొడలు చరిచి సవాళ్లు విసరడం కాదు.. చంద్రబాబు.!

Published on: Thu Sep 10, 2026 11:17AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యధిక కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకులలో ఒకరు. ఆయన ప్రస్తుతం నాలుగవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే వ్యక్తిగత స్థాయిలో, సరిగ్గా మూడేళ్ల కిందట   అప్పటి జగన్ ప్రభుత్వం ఆయనను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసింది. ఏడు పదుల వయస్సులో ఈ అరెస్టు సమయంలో చంద్రబాబు క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనేలా చేసిందని చెప్పాలి. ఏకంగా 53 రోజుల పాటు ఆయనను రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో నిర్బంధించింది.

ఐసోలేటెడ్ సెల్ లో, కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా వేధించింది అప్పటి జగన్ సర్కార్. నాటి రోజులను తాజాగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సామాజిక మాధ్యమ వేదికపై తనను అక్రమంగా అరెస్టు చేసిన నాటి రోజులను గుర్తు చేసుకుంటూ షేర్ చేసిన పోస్టులో తనను అరెస్టు చేసిన తీరు దారుణమనీ పేర్కొన్న చంద్రబాబు.. అయితే ఈ ఘటన తనను ఏ మిత్రం కుంగదీయలేదన్నారు. తనను అరెస్టు చేయించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి తనకు ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టదన్న ఆయన అయితే తన విధానం అది కాదన్నారు. 

తనను చాలా మంది మెతక అనీ, కఠిన నిర్ణయాలు తీసుకోలేని మృదు స్వభావిననీ చెబుతుంటారు.   కానీ వాస్తవానికి తాను చేసే  ప్రతి పనీ తెలుగు ప్రజల శ్రేయస్సు,  సమాజ హితం కోసమే ఉండాలి అని భావిస్తానని పేర్కొన్నారు. రాజకీయాలు అంటే  సవాళ్లు విసురుకోవడం, తొడలు కొట్టుకోవడం కాదన్నారు. అలాగే   ఎన్నికల ఫలితాల ఆధారంగా ఒకరినొకరు అరెస్టు చేయించుకోవడం కూడా కాదన్నారు.  తాను ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజిక హితం గురించి ఆలోచిస్తానని పేర్కొన్నారు. 

[Chandrababu Naidu, AP Politics, YS Jagan Mohan Reddy, Revenge Politics, Telugu Desam Party, Andhra Pradesh News, Telugu One]