TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమిత్ షాకు చంద్రబాబు లేఖ: అర్నాబ్ నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని వినతి.!

Published on: Wed Oct 28, 2026 12:28PM

ఆంధ్రప్రదేశ్ నుఅతలాకుతలం చేసిన అర్నాబ్   తుపాను ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముందస్తు నివారణ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి  ఒక లేఖ రాశారు. . బంగాళాఖాతంలో ఏర్పడిన  అర్నాబ్ తుపాను కారణంగా ప్రాణనష్టం లేకుండా చేయడానికీ, నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆ లేఖలో చంద్రబాబు వివరించారు.

ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో అర్నాబ్ ప్రభావంతో పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం సంభవించిందని పేర్కొన్నారు.  ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా,  ఉత్తరాంధ్ర జిల్లాలో   బీభత్సం సృష్టించిందని పేర్కొన్నారు.  రహదారులపై పడిన వృక్షాలు, దెబ్బతిన్న విద్యుత్ సరఫరా వ్యవస్థ గురించి వివరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని వివరించారు. వర్షాలముప్పు మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.  

ఇక పోతే అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు. అలాగే తుపాను పరిస్థితులను ఎదుర్కొన్ని నష్టాన్ని సాధ్యమైనంత వరకూ నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలో 16ఎన్డీఆర్ఎఫ్, 11 సీఆర్డీఎఫ్ బృందాలను నియోగించినట్లు, అలాగే వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వివరించారు.  

అలాగే ప్రాథమిక అంచనా ప్రకారం తుపాను కారణంగా  180 ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారులపై వందల సంఖ్యలో  చెట్లు కూలిపోయాయని, రహదారులు ధ్వంసమయ్యాయనీ చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.  విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో తుపాను ప్రభావిత ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందనీ, పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామనీ వివరించారు. ఇక దాదాపు 10 వేల 450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని వివరించారు.  

 తుఫాను నష్టంపై సమగ్ర అంచనాను త్వరలోనే కేంద్రానికి నివేదించనున్నట్లు ఆ లేఖలో పేర్కొన్న చంద్రబాబు,  తుపాను సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇతర కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని కోరారు. అలాగే తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు సాధ్యమైనంత త్వరలో కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు.  

[Chandrababu Letter   Home Minister Amit Shah, Cyclone Arnab Effect  AP, Andhra Pradesh Storm, Central Team, Loss Estimate, TeluguOne]