Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళన? ఎందరు మంత్రులపై వేటంటే?
posted on: Mar 21, 2026 2:16PM
.webp)
చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారా? అంటే పరిశీలకుల నుంచి మాత్రం విస్తరణ కాదు ప్రక్షాళనకు ఆయన మొగ్గు చూపుతున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. కాగా చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళనపై గత కొన్ని రోజులుగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలువురు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారనీ, అందుకే కేవలం కేబినెట్ విస్తరణకు, పునర్వ్యవస్థీకరణకు పరిమితం కాకుండా సమూల ప్రక్షాళనే బెటర్ అన్న అభిప్రాయంతో ఉన్నారనీ పార్టీ వర్గాల నుంచి కూడా వినబడుతోంది.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. శాఖల వారీగా జరిగే సమీక్షలలోనే సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరును కూడా మదింపు చేస్తూ వస్తున్నారనీ, ఇప్పుడు ఆ మదింపే ప్రామాణికంగా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అయితే చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళన అంటూ చేస్తే ఎంత మందిపై వేటు పడుతుంది? ఎందరిని కొత్తగా కేబినెట్ లోకి తీసుకుంటారు? ఎవరెవరి శాఖలు మారుస్తారు అన్న దానిపై పలు అభిప్రాయాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.
అయితే పార్టీ సీనియర్ నేతలు మాత్రం పెద్ద సంఖ్యలో కేబినెట్ నుంచి ఉద్వాసనలు ఉండే అవకాశం లేదనీ, పని తీరు మెరుగు పరుచుకునేందుకు కనీసం ప్రయత్నించని ఒకరిద్దరు మంత్రులపై వేటు పడే అవకాశం ఉందనీ అంటున్నారు.
ఇక కొత్తగా కేబినెట్ లోకి తీసుకునే వారిలో యువకులకు అధిక ప్రాధాన్యత ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ పని తీరును మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న స్పందన, మంత్రుల పనితీరుపై ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా మార్పులు చేర్పులు జరుగుతాయని చెబుతున్నారు.


.webp)
.webp)


