TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజేత ఆర్సీబీయే అయినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం వైభవ్ సర్యవంశీయే

Published on: Mon Jun 1, 2026 9:24AM

అహ్మదాబాద్‌లో  ఆదివారం (మే31) రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ లో గుజరాత్ జట్టుపై సునాయాస విజయంతో టోర్నీ చాంప్ గా ఆర్సీబీ  నిలిచింది. అయినా ప్రజంటేషన్ సెర్మనీలో సెంటరాఫ్ అట్రాక్షన్ మాత్రం 15 ఏళ్ల అద్భుతం, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ బాస్ బేబీ వైభవ్ సూర్యవంశీదే.  

 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ప్రభంజనం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. మైదానంలోకి దిగిన ప్రతి సందర్భంలోనూ.. సీనియర్ బౌలర్లను సైతం వణికించిన ఈ యువ సంచలనం..  ఐపీఎల్ 2026 సీజన్‌లోని ప్రధాన వ్యక్తిగత అవార్డులన్నింటినీ  కొల్లగొట్టాడు. ఈ టోర్నమెంట్‌లో అసాధారణమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఏకంగా 776 పరుగులు సాధించి, అత్యధిక పరుగుల బ్యాటర్ గా ప్రతిష్టాత్మక  ఆరెంజ్ క్యాప్  సొంతం చేసుకున్నాడు.  అలాగే.. టోర్నీలోనే అత్యంత విలువైన ఆటగాడిగా  మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుతో పాటు  ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ పురస్కారాన్ని కూడా వైభవ్‌ దక్కించుకున్నాడు. 

అదే విధంగా సీజన్‌లో ఏకంగా 237.31   స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి  సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. రికార్డు స్థాయిలో మొత్తం 72 సిక్సర్లు బాది  సూపర్ సిక్సెస్ అవార్డును దక్కించుకున్నాడు.  ఒకే ఒక ఐపీఎల్ సీజన్‌లో మొత్తం ఐదు ప్రధాన అవార్డులను గెలుచుకుని, ఈ యువ కెరటం ప్రపంచ క్రికెట్‌లో ఒక కొత్త సూపర్ స్టార్‌గా అవతరించాడు.