ఏపీకి మరో వరం ప్రకటించిన కేంద్రం.. ఏంటో తెలుసా?
Published on: Wed Aug 26, 2026 10:10AM

ఏపీ జీవనాడి పొలవరం ప్రాజెక్టు ప్రాంతానికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏపీలోని ఎన్ హెచ్ 365బిబి పరిధిలో ఉన్న 45.09 కిలోమీటర్ల పొడవైన రహదారి విస్తరణ కోసం 840.41 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.
ఇందులో భాగంగా బుట్టాయిగూడెం, ఎల్‌ఎన్‌డి పేట, పట్టిసీమ, కొవ్వూరు ప్రాంతాలను కలిపే రహదారిని పేవ్‌డ్ షోల్డర్స్‌తో కూడిన రెండు లేన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే పొలవరం ప్రాజెక్టు ప్రాంతానికి కనెక్టివిటీ పెరుగుతుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కేవలం మౌలిక వసతుల పెంపు మాత్రమే కాదు, ఆ ప్రాంతాల సామాజిక, ఆర్థిక చిత్రాన్ని సమూలంగా మార్చే ఒక గేమ్ చేంజర్ గా చెప్పవచ్చు.
ఈ రహదారి విస్తరణ వల్ల పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వ్యవసాయఉత్పత్తులకు మెరుగైన సదుపాయం లభిస్తుంది. ఇక్కడ నుంచి పొగాకు, చెరకు, పామాయిల్ ఉత్పత్తులను రైతులు వేగంగా మార్కెట్లకు తరలించడానికి వీలవుతుంది, దీనివల్ల రవాణా ఖర్చులుతగ్గడమే కాకుండా, పొలం నుంచి నేరుగా మార్కెట్‌కు అనుసంధానమయ్యే ఫార్మ్ టు మార్కెట్ కనెక్టివిటీ బలోపేతం అవుతుంది. అంతే కాకుండా ఈ రహదారి వల్ల ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు కూడా నూతన ప్రోత్సాహం లభిస్తుంది.
Center big boost to AP, Polavaram Highway, Nitin Gadkari AP Roads, Polavaram 840 Crore Highway, Kovvur Pattiseema Road, Andhra Pradesh Infrastructure


