మెగాస్టార్ కి ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్.. ఏమన్నారంటే?
Published on: Sat Aug 22, 2026 11:44AM

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చిరంజీవి సాధించిన విజయాలను, ఆయన అందిస్తున్న సామాజిక సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. చిరంజీవి.. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ అపూర్వమైన ప్రజాదరణ పొంది మెగాస్టార్‌గా నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా సమాజం పట్ల బాధ్యతతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎందరో బాధితులకు అండగా నిలిచారనీ, కొత్త జీవితాన్ని ప్రసాదించారనీ పేర్కొన్నారు.
కేంద్ర మాజీ మంత్రిగా, పద్మభూషణ్ గ్రహీతగా చిరంజీవి సాధించిన పురస్కారాలు తెలుగువారి గర్వకారణమన్న చంద్రబాబు. . చిరంజీవి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని, పూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చంద్రబాబు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, సంఖ్యలో అభిమానులు సోషల్ మీడియా ద్వారా చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
CBN ishes Megastar on his birth day, Chiranjeevi Birthday, CM Chandrababu Naidu, Chiranjeevi Birthday Wishes, TeluguOne


