TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమ్మెల్సీ భరత్ పై కుప్పంలో కేసు.. ఎందుకంటే?

Published on: Thu Sep 10, 2026 8:08AM

స్థానిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో పెరిగింది. ముఖ్యంగా వైసీపీ నేతలు స్థానిక సమరంలో విజయం కోసం హింసకైనా వెనుకాడదంటూ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.   తాజాగా  కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి.  కుప్పంలో ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన ఎమ్మెల్సీ భరత్.. స్థానిక సమరంలో విజయం కోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధం కావాలంటూ శ్రేణులకు ఇచ్చిన పిలుపు కలకలం రేపింది. రక్తపాతం సృష్టించైనా ఎన్నికలలో విజయం సాధించాలంటూ ఆయన ఆ సమావేశంలో వైసీపీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. 

ఎమ్మెల్సీ భరత్   వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయని, ఇవి ప్రత్యర్థులలో భయాందోళనలు సృష్టించేలా ఉన్నాయని తెలుగుదేశం నేతలు విమర్శలు గుప్పించారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా భరత్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ.. తెలుగుదేశం కుప్పం అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆ ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.  


[Case Regestered On MLC Bharat, Kuppam Police YCP, Provocative Remarks, TeluguOne, Andhra Pradesh politics]