డీ10 టీవీ షో విన్నర్ రాజుపై కేసు నమోదు అరెస్ట్..!
Published on: Sat Sep 12, 2026 2:33PM

హైదరాబాద్‌లో డీ10 టీవీ షో విన్నర్ రాజుపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ యువతిని లైంగికంగా వేధించాడంటూ రాజుపై ఫిర్యాదు అందడంతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజును అరెస్ట్ కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్‌కు తరలించారు. అయితే రాజుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయాన్ని మియాపూర్ పోలీసులు ఇన్నిరోజులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. డీ10 టీవీ షో ద్వారా గుర్తింపు పొందిన రాజుపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.

[ Case filed against D10 TV show winner Raju, D10 TV show, winner Raju, Miyapur Police Station, CP Sajjanar, DGP C.V. Anand, CM Revanth reddy,Telugu One, Telugu News ]


