అధికారుల విధులకు ఆటంకం.. కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు: జగన్ పై పులివెందులలో కేసు.!
Published on: Tue Nov 3, 2026 9:16AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై ఆయన సొంత అడ్డా పులివెందులలో పోలీసు కేసు నమోదైంది. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
పులివెందులలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమ పార్టీ తరఫున ఏజెంట్లను పోలింగ్ బూత్ లలోకి అనుమతించడం లేదని, ఎలాంటి అధికారిక పర్యవేక్షణ లేకుండా ఏకపక్షంగా పోలింగ్ నిర్వహిస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రం, అలాగే రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమం కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం ఉద్రిక్తత నెలకొంది. తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
[Case Against Jagan Pulivendula, Pulivendula Police Station, FormerCM, Former CM, AP Local Body Elections, Telugu One]


