బంగాళాఖాతంలో కార్గో ఓడ మునికి 24 మంది సిబ్బంది గల్లంతు.!
Published on: Sun Aug 23, 2026 7:08AM

బంగాళాఖాతంలో ఓ కార్గో నౌక మునిగి అందులోని సిబ్బంది గల్లంతైన సంఘటన ఒడిశా తీరం సమీపంలో చోటు చేసుకుంది. భారీ యంత్రాలు, వేల టన్నుల ఐరన్ ఓర్ లోడుతో ఒడిశా రేవు నుంచి శుక్రవారం బయలుదేరిని ఈ నౌక శనివారం (ఆగస్టు 22) రాత్రి పదిన్నర గంటల సమయంలో మునిగిపోయింది. ఒడిశా పారాదీప్ ఐలాండ్ కు దాదాపు 240 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ నౌక మునిగిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. రాత్రి వేళ చీకటిలో సముద్రం మధ్యలో ప్రమాదం జరగడంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే నౌక పూర్తిగా సముద్రంలో కలసిపోయింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో అత్యధికులు చైనా దేశస్థులు కాగా, ఒకరు బంగ్లాదేశ్ కు చెందినవారు, ముగ్గురు మయన్మార్ జాతీయులుగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ సిబ్బంది సంయుక్తంగా అత్యవసర రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. పారాదీప్ కోస్ట్ గార్డ్ యూనిట్ తో పాటు అండమాన్ అండ్ నికోబార్ డివిజన్ కి చెందిన గాలింపు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
ప్రమాదం జరిగిన తీర ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఇతర వాణిజ్య నౌకలను, మత్స్యకార పడవలను సైతం అధికారులు తక్షణమే అప్రమత్తం చేశారు. సముద్రంలో గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం చుట్టుపక్కల నౌకలు కూడా సహాయక చర్యల్లో భాగస్వామ్యమయ్యాయి.
Cargo Ship Sink in Bay of Bengal, Odisha Coast Ship Accident, Paradip Coast Rescue, Indian Navy Search Operation


