అమెరికాతో కెనడా వాణిజ్య చర్చలు బంద్.!
Published on: Sat Aug 22, 2026 11:56AM

అమెరికాతో కెనడా వాణిజ్య చర్చలను బంద్ చేసింది. ఈ రెండు దేశాల మధ్యా ఉన్న ఉచిత వాణిజ్య బంధానికి కెనడా చెల్లు చీటీ రాసేసింది. దశాబ్దాలుగా హిత మిత్రదేశాలుగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఒక్కసారిగా క్షీణించాయి. అమెరికాతో సాగిస్తున్న కీలక వాణిజ్య చర్చలను నిలిపివేస్తున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు. చర్చల చివరి దశలో అమెరికా ప్రతిపాదించిన కొత్త షరతులు అసంబద్ధంగా, ఏకపక్షంగా, తమకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంటూ.. కెనడా ప్రయోజనాల పరిరక్షణ కోసం అమెరికాతో వాణిజ్య చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు ఆయనా ప్రకటనలో పేర్కొన్నారు. కెనడా ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నందున ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని స్పష్టం చేశారు.
అదలా ఉండగా, అమెరికా కూడా.. తీవ్రంగా స్పందించింది. కెనడా నుంచి దిగుమతి అయ్యే 20 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్‌లు విధించేందుకు నిర్ణయించింది. ఇతర ప్రధాన ఎగుమతి దేశాల కంటే కెనడాకు అత్యంత మెరుగైన వాణిజ్య సదుపాయాలు కల్పించేందుకు తాము ముందడుగు వేసినప్పటికీ.. కెనడానే చివరి నిమిషంలో కొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చిందని అమెరికా ఆరోపించింది. గతంలో అంగీకరించిన కొన్ని కీలక హామీల నుంచి కూడా కెనడా వెనక్కి తగ్గిందని పేర్కొంది.
Canada band trade talks with America, Mark Carney Canada PM, Donald Trump 50 percent tariffs, US Canada trade dispute, 880 billion trade war


