TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బొద్దింకలకు జ్యుడీషియల్ కస్టడీ: కారణం ఏంటంటే.?

Published on: Wed Oct 14, 2026 3:43PM

బెయిలు నిబంధనలు ఉల్లంఘించినందుకు కాక్రోచ్ జనతాపార్టీ నేతలు  సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలతో పాటు మరో సభ్యుడిని కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.   బెయిల్ బాండ్ నిబంధనలను బేఖాతరు చేస్తూ నిరసన ప్రాంతాల్లోకి వెళ్లినందున కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.   గతంలో ఈ నేతలు అరెస్టయిన తరుణంలో న్యాయస్థానం వారికి  కండీషన్డ్ బెయిలు మంజూరు చేసింది. అయితే షరతులతో కూడిన బెయిలుపై విడుదలైన వారు, ఆ షరతులను ఉల్లంఘించి మళ్లీ వివాదాస్పద కార్యకలాపాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.  

అధికారికంగా నిషేధిత ప్రాంతంగా ఉన్న  జంతర్ మంతర్ వద్దకు రహస్యంగా చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు.  దీంతో మేజిస్ట్రేట్ వారిని ఐదు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.  జ్యుడీషియల్ కస్టడీ ముగిసిన అనంతరం వారిని మళ్లీ కోర్టులో హాజరు పరుస్తారు.  

[Cacroach Janatha Party Leaders Judicial Custody, Sourav Das, Ashutosh Ranka, judicial custody, Jantar Mantar violation, Bail Bond Breach, TeluguOne]