Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...500 వికెట్ల క్లబ్ లో బుమ్రా
posted on: Mar 6, 2026 8:23AM
.webp)
టీమ్ ఇండియా స్టార్ పేసర్ బుమ్రా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 500 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఈ ఘనత సాధించిన తొమ్మిదో ఇండియన్ బౌలర్ బుమ్రా. బుమ్రాకు ముందు అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, కపిల్ దేవ్, జహీర్ ఖాన్, రవీంద్ర జడేజా, జవగల్ శ్రీనాథ్ లు ఈ ఘనత సాధించారు.
టి20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం (మార్చి 5) రాత్రి ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో తాను వేసిన తొలి బంతికే ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో తన 500వ వికెట్ సాధించాడు. 2016 జనవరిలో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన బుమ్రా ఇప్పటివరకు 52 టెస్టుల్లో 234, 89 వన్డేల్లో 149, 94 టీ20ల్లో 117 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.


.webp)
.webp)


