TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అధిక వడ్డీకి ఆశపడిన ఆ మహిళ చివరకు ఏమైందో తెలుసా?

Published on: Fri Aug 28, 2026 9:52AM

అధిక వడ్డీ మోజులో పడి ప్రాణాలు పొగొట్టుకున్న ఒక మహిళ ఉదంతమిది.  కష్టపడి కూడబెట్టిన సొమ్మును పేరాశకు లోనై అధిక వడ్దీ ఆశతో  వేరొకరి చేతిలో పోసి.. ప్రాణాలమీదకు తెచ్చుకున్న మహిళ ఉదంతం మార్కాపురంలో వెలుగు చూసింది.   అధిక వడ్డీకి ఆశపడిన ఓ మహిళ.. తన నగలన్నీ అమ్మి మరీ అప్పు ఇచ్చింది. అలా అప్పు ఇవ్వడమే ఆమె పాలిట శాపంగా మారింది. చివరకు అప్పి ఇచ్చిన మహిళ చేతిలోనే దారుణంగా హతమైంది. ఆలస్యంగా వెలుగు చేసిన ఈ దారుణ ఉదంతానికి సంబంధించి పూర్వాపరాలిలా ఉన్నాయి.

ఆదిలక్ష్మి అనే  32 ఏళ్ల మహిళ తనకు  పరిచయస్తురాకి పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చింది. భారీగా వడ్డీ ఇస్తానని నమ్మపలకడంతో ఆదిలక్ష్మి మరో ఆలోచన లేకుండా..  తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను విక్రయించి,  అప్పులు చేసి  మరీ 50 లక్షల రూపాయలను  ఆదిలక్ష్మి ఆ మహిళకు అందజేసింది.  అయితే చెప్పినట్లుగా వడ్డీ ఇవ్వక పోవడం, పైగా తాను ఇచ్చిన మొత్తాన్ని ఎప్పుడు తిరిగి ఇస్తుందన్న విషయంలో స్పష్టత కొరవడటంతో ఆదిలక్ష్మి ఆందోళణకు గురై.. వడ్డీ మాట దేవుడెరుగు, అసలైనా వెంటనే ఇచ్చేయాలంటూ ఒత్తిడి చేసింది. దీంతో పథకం ప్రకారం నిందితురాలు.. ఆదిలక్ష్మిని డబ్బుల విషయమై మాట్లాడేందుకు తన ఇంటికి పిలిచి దారుణంగా హత్య చేసింది. 

నేరం బయటపడకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి   సమీపంలోని ఒక   పొలంలో  సమాధి చేసింది.  బాధితురాలు  కనిపించకపోవడంతో.. ఆమె  భర్త వెంటనే  పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమ దర్యాప్తులో  ఆదిలక్ష్మి కాల్ డేటా ఆధారంగా నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించగా, విషయం బయటపడింది.  

నిందితురాలు తాను చేసిన నేరాన్ని అంగీకరించింది.  పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ నేరంలో ఆమెకు ఇంకెవరైనా   సహకరించారా అనే కోణంలో  విచారణ కొనసాగిస్తున్నారు. సేకరించిన కీలక ఆధారాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలుచేశారు.  

Brutal Murder For Money, Adilakshmi, Victim, Crimenews, Andhra Prasesh, Telugu One