TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కార్యకర్తల సమావేశంలో కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్సీ బొత్స..!

Published on: Thu Sep 10, 2026 3:07PM

మేనల్లుడు ఆత్మీయ అనుబంధం గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనైన ఎమ్మెల్సీ..!

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన పార్టీ అంతర్గత సమావేశంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.  స్థానిక నాయకులు  కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాతుండగా ఒక్కసారిగా ఉద్వేగం కట్టలు తెంచుకుంది. గత రాజకీయ పరిణామాలు, పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తుచేసుకుంటూ ఆయన స్టేజ్‌పైనే కన్నీటి పర్యమ్యమయ్యారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ, ఎన్నో హెచ్చుతగ్గులను చూసిన బొత్స సత్యనారాయణ ఇలా బహిరంగంగా భావోద్వేగానికి లోనుకావడం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సభలో ఆయన మాట్లాడుతున్నంతసేపు వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆయన కంటతడి పెట్టడాన్ని చూసి అక్కడున్న పార్టీ కేడర్ తీవ్ర ఆందోళనకు, విచారానికి గురయ్యారు.సొంత నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు అండగా ఉంటానని భెరోసా ఇస్తున్న తరుణంలో ఆయన గొంతు పూడుకుపోయింది. పార్టీ శ్రేణులు తమను నమ్ముకుని ముందుకు వెళ్తున్న తీరును ప్రశంసించే క్రమంలో ఆయన గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పార్టీ నేతలు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ, కొంతసేపు అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ ఘటనతో స్థానిక రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీనియర్ నాయకుడి స్థాయి వ్యక్తి ఇలా భావోద్వేగానికి గురికావడం వెనుక ఉన్న అసలు కారణాలపై ఇప్పుడు జోరుగా చర్చలు సాగుతున్నాయి.రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను మరింత దూకుడుగా నిర్వహించాలని, కేడర్‌కు మనోధైర్యం కల్పించేలా అగ్రనేతలు పర్యటనలు ఉండాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టనుందనేది వేచి చూడాలి.

తన మేనల్లుడు, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) టీడీపీలో చేరడంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఈ ఉద్విగ్నభరిత ఘటన చోటుచేసుకుంది.

చిన్న శ్రీనుతో తనకున్న అనుబంధాన్ని, కార్యకర్తలతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్న బొత్స ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. దీంతో సమావేశంలో కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది. అనంతరం తేరుకున్న ఆయన కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

“రాజకీయాల్లో వ్యక్తులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ పార్టీ శాశ్వతం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పార్టీలు మారుతుంటారు. ఎవరూ అధైర్యపడొద్దు” అని కార్యకర్తలకు బొత్స పిలుపునిచ్చారు.

జగన్మోహన్ రెడ్డి ఆశయాల సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. తాను, ఇతర సీనియర్ నేతలు ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు.

 

 

(Botsa Satyanarayana, Cheepurupalli meeting, YSRCP leaders, Botsa emotional, Andhra Pradesh politics, TeluguOne news, Majji srinivasarao, YS Jagan)