TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భీమిలి వైసీపీ ఇన్ చార్జిగా బొత్స కుమార్తె.!

Published on: Sat Sep 19, 2026 12:35PM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూషకు వైసీపీ కీలక పార్టీ పదవిని కట్టబెట్టింది.   భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

గతంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను  ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. చిన్న శ్రీను స్వయంగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు కావడం గమనార్హం. మజ్జీ శ్రీనివాసరావు రాజీనామా చేయడంతో  భీమిలి వైసీపీలో ఏర్పడిన  ఖాళీని జగన్ డాక్టర్ బొత్స అనూష నియామకంతో భర్తీ చేశారు.    ఈ నియామకం ద్వారా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో యువ నాయకత్వానికి, అలాగే మహిళా నేతలకు పార్టీలో పెద్దపీట వేస్తున్నట్లు సంకేతాలు పంపారు. 

భీమిలి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, క్రియాశీలక కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లే  బాధ్యతను బొత్స అనూషకు జగన్ అప్పగించారు.  ఈ సందర్భంగా జగన్ కు కృతజ్ణతలు తెలిపిన డాక్టర్ అనూష..  పార్టీ అధినాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, భీమిలిలో వైసీపీని మరింత పటిష్టం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. స్థానిక కేడర్‌ను కలుపుకొని పోతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం   శ్రమిస్తానన్నారు.    


[Botsa Anusha, YCP Bheemili Constituency Incharge, Botsa Satyanarayana, Daughter, AP Politics, Telugu One]