వర్షా కాలంలో ఇమ్యునిటి పెంచుకోవడం ఎలా?

వర్షా కాలం లో ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది పెద్ద ప్రశ్న? ఇమ్యునిటి పెంచుకోడానికి కింద పేర్కొన్న 5 రకాల వస్తువులు తీసుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. సహజంగా అందరికీ వర్షాకాలం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది.ఇదే సమయం లో అనారోగ్య సమస్యలు మరిన్ని చుట్టూ ముడతాయి.సరిగ్గా ఈ సమయం లోనే మీరు మీఆహారం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.ఈ కారణంగా మీకు ఇమ్యునిటీ బూస్ట్ లభిస్తే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. వేసవి కాలంలో అధిక వేడిమి తాపం నుండి మనకు ఉపసమనం కలగాలంటే వర్షం ఆనందాన్ని ఇస్తుంది. వర్షా కాలం లో రోగాలు పెరిగే అవకాశం ఉంటుంది.ఈ వాతావరణం లో జలుబు,దగ్గు,నీరసం చర్మసంబంధమైన సమస్యలు వస్తాయి.ఈ సందర్భం లోనే ఇమ్యునిటీ  బలోపేతం చేయడం అత్యవసరం.

ఉత్తమమైన పద్ధతి ఏమిటి అంటే...

వర్షాకాలం లో అనిఇరకాల పళ్ళు,కూరగాయలు,తీసుకోవాలి.మరి అయిదు రకాల పళ్ళు ఏమిటో తెలుసుకుందామా మరి.

తక్కువ ఫ్యాట్ ఉన్న పెరుగు...

మీకు ఆశ్చర్యం కలిగించి ఉండచ్చు.ఇమ్యునిటీ ని పెంచేందుకు పెరుగులో లభించే ప్రోయోయిటిక్స్ జలుబు,నీరసం,వంటి సమస్యలకు కొంత ఉపసమనం కలిగిస్తుంది. శరీరంలో ఉన్న పంచేంద్రియాలు ఆరోగ్యంగా ఉంచేందుకు పెరుగు ఉపయోగ పడుతుంది.

మష్రూమ్...

మష్రూమ్ పుట్టగోడుగులో ఫైబర్ పీచు పదార్ధంప్రోటీన్,యాంటి ఆక్సిడెంట్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని బూస్ట్ చేసేందుకు బాగా ఉపయోగ పడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి.బరువు అంటే ఊబ కాయాన్ని తగ్గించడం లో సహాయ పడుతుంది.

మాంసం...

మనము తీసుకునే  మాంసాహారాము లో ప్రోటీన్లతో నిండి ఉంటుంది.కణాలను రిపేర్ చేయడం నుండి విటమిన్ బి,జింక్,ఐరన్ ఒమేగా౩ పుష్కలంగా లభిస్తుంది.

నట్స్...

శరీరంలో ఇమ్యునిటీ పెంచేందుకు విటమిన్స్ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి.ఇమ్యునిటీని పెంచుతుంది.విటమిన్ ఇ నియాసిన్ రేబఫ్లోబిన్ వంటివి ఉంటాయి.

టీ...

టీ మీ ఇమ్యునిటీని పెంచడం లో సహాయపడుతుందన్న విషయం మీకు తెలుసా.అన్నిరకాల  టీ లు ఫలిపినోల్స్,ఫెలేవోనోయిడ్స్ యాంటి ఆక్సిడే న్ట్స్ ఉంటాయి. అది గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ కావచ్చు.