బొల్లారం పాప హత్య కేసులో మరో ట్విస్ట్.. అసలేం జరిగిందంటే.?
Published on: Sun Oct 11, 2026 12:29PM

ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది. బొల్లారంలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుతుందని ఆశగా ఎదురుచూసిన కుటుంబానికి తీరని శోకం మిగిలింది. విల్లా ఆర్కిడ్ క్లబ్‌హౌస్ సెల్లార్‌లో చిన్నారి మృతదేహం లభించడంతో స్థానికంగా కలకలం రేగింది. సికింద్రాబాద్ బొల్లారం పరిధిలోని విల్లా నంబర్ 84లో నివసిస్తున్న అగ్రికల్చర్ సైంటిస్ట్ మిల్టన్ ఫెర్నాండెజ్ కుమార్తె అరేలియా కిడ్నాప్‌కు గురైంది. చిన్నారిని విడిచిపెట్టాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని నిందితుడు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో అదే విల్లాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విక్రమ్‌పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.
చిన్నారి వెనుకే విక్రమ్ వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘటనకు ముందు రెండు రోజులుగా అతడు ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు రాత్రివేళ డ్రోన్ కెమెరాలతో పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అయినప్పటికీ తొలుత చిన్నారి జాడ లభించలేదు. అనంతరం విల్లా పరిసరాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టగా, క్లబ్‌హౌస్ సెల్లార్‌లో చిన్నారి మృతదేహం కనిపించింది. చిన్నారిని హత్య చేసి అక్కడ పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చిన్నారి మృతదేహం లభ్యమైన తర్వాత నిందితుడి ఆచూకీపై పోలీసులు దృష్టి సారించారు.

చిన్నారిని హత్య చేసిన అనంతరం విక్రమ్ సికింద్రాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మొబైల్ ఫోన్ సిగ్నల్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో గుర్తించారు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో లొకేషన్ ఆధారంగా గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి వేళ డ్రోన్ కెమెరాలతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉన్న లాడ్జీలు, హోటళ్లలో మల్కాజ్‌గిరి పోలీసుల బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మరోవైపు, విక్రమ్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. చిన్నారి కిడ్నాప్‌తో మొదలైన ఈ ఘటన విషాదాంతం కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కిడ్నాప్ కేసు విషాదాంతంగా మారడంతో బొల్లారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాపా మెయిన్ హాల్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో విక్రమ్ ఆమెను వెంబడించినట్లు సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. తాను పాపాతో కలిసి వెళ్తున్నానంటూ మరో వ్యక్తికి సైగలు చేసిన దృశ్యాలు కూడా కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతరం సైకిల్‌పై వెళ్తున్న చిన్నారిని సెల్లార్‌లోకి తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.చిన్నారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన విక్రమ్.. ఆ తర్వాత పాపాను హత్య చేసి, మృతదేహానికి బండరాయి కట్టి నీటిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.
అయితే, పాపాపై అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. పాప మెడకు థ్రెడ్ పెట్టి లాగి చంపినట్లు గాయాలు కనిపిస్తు న్నాయని ఫోరెన్సిక్ డాక్టర్ లక్ష్మణ్ రావు వెల్లడించారు. దీంతో పోలీసులు పాపను హత్య చేసిన అనంతరం విక్రమ్ అక్కడి నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. విక్రమ్ కదలికలకు సంబంధించిన లొకేషన్ వివరాల ఆధారంగా అతడు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు, విక్రమ్‌తో మాట్లాడిన మరో సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనలో అతడి పాత్ర ఏమైనా ఉందా? విక్రమ్ ఎక్కడ దాక్కున్నాడు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..
[ Bollaram Child Death Case, Five-Year-Old Girl Kidnapping, Bollaram Crime News, Missing Girl Case, Child Murder Case, Bollaram Twist, Hyderabad Crime News, Telangana Crime News, Kidnapped Girl Found Dead, Police Investigation, Child Safety, Bollaram Breaking News, Shocking Crime Story, Child Death Investigation, Hyderabad Latest News ]


