బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: రాజస్థాన్ లో ముగ్గురు సజీవ దహనం.!
Published on: Thu Nov 5, 2026 12:26PM

రాజస్థాన్‌లో ఓ బాణా సంచ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి రాజస్థాన్ లోని నాగోర్‌లో బాణాసంచా, గన్ పౌడర్ తయారీ కేంద్రంలో ఈ పేలుడు సంభవించింది.
.webp)
ఈ దుర్ఘటనలో మృతులు నాగోర్ పట్టణంలోని బన్ బజార్ వాడ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. పేలుడు ధాటికి అ చుట్టుపక్కల దాదాపు 100 అడుగుల పరిధిలో ఉన్న ఇళ్లు, వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రమాద స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు.
[Blast in Fire Works Factory, Three Dead, Rajasthan, Huge Fire, Several, Vehicles, Damaged, Telugu One]


