TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కండరాల బలం, గుండె ఆరోగ్యానికి నల్ల శెనగలు: పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు!

Published on: Mon Aug 31, 2026 11:24AM

మన తాతముత్తాతల కాలం నుండి భారతీయ సాంప్రదాయ ఆహారంలో నల్ల శెనగలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. నిత్యం మనం తీసుకునే ఆహారంలో లభించే పోషకాల కంటే నల్ల శెనగలు అందించే పోషక విలువలు ఎంతో ప్రత్యేకమైనవి. ప్రతిరోజూ మనం 10 గుడ్లు తినడం ద్వారా లేదా లీటర్ పాలు తాగడం ద్వారా పొందే శక్తిని, కేవలం కొద్దిగా ఉడకబెట్టిన నల్ల శెనగలను తినడం ద్వారా డబుల్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బలహీనతతో బాధపడేవారికి, కండరాల బలం పెంచుకోవాలనుకునేవారికి మరియు ప్రతిరోజూ ఉత్సాహంగా ఉండాలనుకునేవారికి ఇది ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్‌గా నిలుస్తుంది.

ఈ శెనగలను వివిధ రూపాల్లో ఆహారంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట నానబెట్టిన శెనగలను ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో ఉడకబెట్టి గుగ్గిళ్ల మాదిరిగా తాలింపు పెట్టుకుని తింటే శరీరానికి అవసరమైన పుష్కలమైన ప్రోటీన్ లభిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉండి తరచూ నిరసించిపోయే వారికి నానబెట్టిన లేదా వేయించిన నల్ల శెనగలు తిరుగులేని శక్తిని అందిస్తాయి. వీటిలో లభించే పీచు పదార్థం (ఫైబర్) జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ సులభతరం కావడమే కాకుండా కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపి కడుపును పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారికి నల్ల శెనగలు ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా పదేపదే ఆకలి వేయకుండా ఉండి అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. రక్తం లోని గ్లూకోజ్ లేదా షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉంచడంలో ఇవి ఎంతో తోడ్పడతాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారు అలాగే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు వీటిని తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా హృద్రోగాల ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది.

 

 

 

 

black chickpeas for weight loss and health, black chickpeas nutrition benefits in Telugu.