బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా.. రేపే జనసేనలోకి!!

 

రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావుకు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. అలాగే బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణకు లేఖ రాసారు. కాగా.. ఈయన బీజేపీకి గుడ్ బై చెప్పనున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రేపు ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తోంది.