TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బిస్లరీ వాటర్ సురక్షితం కాదా: ప్రమాణాలకు అనుగుణంగా లేదు: ఎఫ్ఎస్ఎస్ఐ.!

Published on: Mon Nov 23, 2026 5:08PM

బిస్లరీ   ఉత్పత్తుల్లో హానికారక రసాయనాలు ఉన్నట్టు వెలువడిన నివేదికలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బిస్లరీ ప్యాకేజ్   డ్రింకింగ్ వాటర్ బ్రాండ్లు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవన్న నివేదికల ఆధారంగా తనిఖీలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.     బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఒక నమూనా సురక్షితం కాదని తేలడంతో ఆ సంస్థపై విచారణకు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ అనుమతించింది. 

అయితే, ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో బిస్లరీ నమూనాలు ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని తేలినట్లు ప్రభుత్వ వర్గాలు  తెలిపాయి. అంతకుముందు, సురక్షితం కాదని గుర్తించిన కంపెనీ ప్యాకేజ్డ్ వాటర్ బ్యాచ్‌లను ఎఫ్ఎస్ఎస్ఐ వెనక్కి తీసుకుంది. 

నాణ్యత ప్రమాణాలను అందుకోని ఉత్పత్తులు సెప్టెంబర్ 2025లో తమ గోవా ప్లాంట్‌లో తయారైన ఒక బ్యాచ్‌కు సంబంధించినవని బిస్లరీ వివరణ ఇచ్యచింది. ఎఫ్ఎస్ఎస్ఐ సేకరించిన ఆరు నమూనాల్లో ఐదు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని,   ఒక దాంటో మాత్రమే  బ్రోమేట్' స్థాయిలు నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా నమోదయ్యాయని కంపెనీ వివరించింది.

దీనిపై తాము అప్పీల్ చేయగా, ఆ నమూనాను రిఫరల్ ల్యాబొరేటరీకి పంపారని బిస్లరీ వెల్లడించింది. అక్కడ జరిగిన పరీక్షల్లో బ్రోమేట్ స్థాయిలు పరిమితికి లోబడే ఉన్నాయని తేలినప్పటికీ,  పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ) ఉన్నట్లు ల్యాబ్‌ ప్రత్యేకంగా గుర్తించిందని పేర్కొంది.

ఇది కూడా చదవండి:  హైదరాబాద్‌లో తాగు నీటి స‌మ‌స్య రావొద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు.!

అదే నమూనాను ఎప్ఎస్ఎస్ఐ ఆమోదించిన మరో ల్యాబ్‌లో స్వతంత్రంగా పరీక్షించగా, అందులో కూడా బ్రోమేట్ స్థాయిలు నిర్దేశిత పరిమితిలోనే ఉన్నాయని బిస్లరీ స్పష్టం చేసింది. 

ఈ పరీక్షా ఫలితాలను ఫిబ్రవరి 2026లో నియంత్రణ సంస్థకు సమర్పించామని, ఆ తర్వాత వారి నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఆ వివాదం ముగిసిపోయిందని తాము భావించినట్లు బిస్లరీ సంస్థ పేర్కొంది

మీకు నచ్చవచ్చు:  గాలి కాలుష్యానికి తోడైన నీటి కాలుష్యం! ఢిల్లీలో డేంజర్ బెల్స్ ​

నీళ్లు తాగే విషయంలో మీరు చేస్తున్న తప్పులేంటి..ఆయుర్వేద వైద్యురాలి సమాధానం!​


[Bisleri prosecution, Bisleri packagedg water, a  FSS Act,  Bromate , TeluguOne]