TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బర్త్ రైట్ సిటిజెన్‌షిప్.. ట్రంప్ ఉత్తర్వులపై కోర్టు స్టే.!

Published on: Thu Sep 3, 2026 11:05AM

అమెరికా రాజకీయాల్లో, ఇమ్మిగ్రేషన్ రంగంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు వరుసగా కోర్టులలో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా..   అమెరికా గడ్డపై జన్మించే పిల్లలకు జన్మతహ అమెరికా పౌరసత్వాన్ని ప్రసాదించే  బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్  నిబంధనలను కుదించేందుకు ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన  ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమెరికా ఫెడరల్ కోర్టు అడ్డుకుంది. మేరీల్యాండ్‌కు చెందిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి  డెబోరా బోర్డ్‌మన్ ఈ ఉత్వర్వులపై   స్టే విధించారు. ఇమ్మిగ్రెంట్ కుటుంబాలు, పౌరహక్కుల సంఘాలు,  సివిల్ రైట్స్ సంస్థలు దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ లాప్‌సూట్ పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఈ స్టే అమల్లో ఉంటుందని న్యాయమూర్తి  తన తీర్పులో స్పష్టం చేశారు.

ఈ తీర్పు ద్వారా రాజ్యాంగంలోని 14వ సవరణ కల్పించిన హక్కులకు   రక్షణ లభించింది. సుప్రీంకోర్టు గతంలోనే ఈ అంశంపై స్పష్టమైన తీర్పునిచ్చిందని, సర్వోన్నత న్యాయమూర్తులు చెప్పినట్లుగా సర్టిఫైడ్ క్లాస్‌లోని పిల్లలందరూ పుట్టుకతోనే అమెరికా పౌరులని జడ్జి డెబోరా బోర్డ్‌మన్ తన తీర్పులో  ప్రస్తావించారు. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో అమెరికా రాజ్యాంగాన్ని ఏ ఒక్కరూ ఏకపక్షంగా మార్చలేరని కోర్టు తేల్చిచెప్పింది.  మరోవైపు, వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్న ఏసీఎల్‌యూ ( లాంటి సంస్థలు ఈ తీర్పును  చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ స్వాగతించాయి. అమెరికాలో పుట్టిన ప్రతీ పిల్లాడికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ఏ ప్రయత్నమైనా చెల్లదని ఈ తీర్పు మరోసారి రుజువు చేసిందని పేర్కొన్నాయి.  


[birthright citizenship, donald trump, us court stay, us immigration news, fourteenth amendment, trump executive order]