TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బొద్దింకల సైన్యం: సూక్ష్మ డ్రోన్లు.. ఇజ్రాయెల్‌ ప్రయోగాలు సక్సెస్.!

Published on: Wed Sep 23, 2026 10:34AM

ఆధునిక యుద్ధ రంగంలో సాంకేతిక ప్రమేయం, ప్రభావం రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. శత్రువులను మట్టబెట్టేందుకు సరికొత్త ఆయుధాలను అభివృద్ధి చేయడంలో ఇజ్రాయిల్ ఒక అడుగు ముందుకు వేసింది. తాజాగా ఇజ్రాయిల్ పరిశోధకులు, రక్షణ రంగ నిపుణులు  కొత్త  ఆవిష్కరణకు తెరతీశారు. బయో, ఇన్స్పైర్డ్ రోబోటిక్స్   టెక్నాలజీ ద్వారా   సూక్ష్మమైన రోబోటిక్ బొద్దింకలు,  మైక్రో డ్రోన్లను తయారు చేశారు. భూగర్భ సొరంగాల్లో, ఇరుకైన కలుగుల్లో,  ఎవరికీ అంతుచిక్కని చీకటి ప్రాంతాల్లో దాక్కునే ఉగ్రవాదులను ఏరిపారేయడానికి ఈ  టెక్నాలజీ ఎంతగానో  ఉపయోగపడుతుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణ సైనికులు ప్రవేశించలేని  ప్రదేశాలకు ఈ రోబోటిక్ బొద్దింకలు ఇట్టే చేరుకోగలవు.

యుద్ధ వ్యూహాలను పూర్తిగా మార్చేయగల ఈ మైక్రో రోబోలు జీవుల కదలికలను పోలి ఉంటాయి. ఇరుకైన దారుల్లో వేగంగా ప్రయాణించడం, ఎవరికీ అనుమానం రాకుండా శత్రువుల కదలికలను నిరంతరం గమనించడం వీటి ప్రత్యేకత. ఈ సరికొత్త ఆవిష్కరణ ద్వారా   సెకన్ల వ్యవధిలో కీలక సమాచారాన్ని మిలిటరీ కంట్రోల్ రూమ్‌కు చేరవేయవచ్చు.   ఆధునిక యుద్ధాల్లో మానవ ప్రాణాలను కాపాడుకోవడానికి, శత్రువుల వ్యూహాలను ముందే తిప్పికొట్టడానికి ఈ బయో ఇన్స్పైర్డ్ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్‌గా మారనుందంటున్నారు రక్షణ రంగ నిపుణులు.  

అయితే.. ఇటువంటి పరికరాలను సైనిక నిఘా కోసం వినియోగించడం వల్ల గోప్యత, పౌరుల భద్రత, యుద్ధంలో సాంకేతికత వినియోగానికి సంబంధించిన నైతిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వయంచాలక వ్యవస్థలకు ఎంతవరకు నిర్ణయాధికారం ఇవ్వాలి, మానవ పర్యవేక్షణ ఎలా ఉండాలి అనే అంశాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. 


[Bio Inspired Robotics, Israel Military Technology, Robotic Cockroaches, Micro Drones, Defense Tech, Military Innovation, Telugu One]