Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయి : కేంద్రం
posted on: Feb 10, 2026 6:16PM

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో విద్యా ,ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌లను 42 శాతానికి పెంచడంపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించడంపై కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి బి.ఎల్.వర్మ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి తెలంగాణ శాసనసభ కార్యదర్శి నుంచి రెండు బిల్లులు వచ్చాయని, అవి రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీ కుల గణనతో పాటు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కూడా దక్కకుండా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడ్డుకుంటున్నారని ఆయన గతంలో తీవ్ర విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ అధికార పక్షం జాతీయ స్థాయిలో పోరాటానికి దిగింది. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాలో నిర్వహించారు


.webp)



