TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విడదల రజనీ ఇలాకాలో వైసీపీకి బిగ్ షాక్: దేశం గూటికి వైసీపీ మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి.!

Published on: Mon Oct 26, 2026 11:44AM

పల్నాడు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. స్థానిక ఎన్నికల  వేళ.. వైసీపీ తరఫున  వైసీపీ మున్సిపల్ చైర్మన్  రేసులో ఉన్న కీలక నాయకురాలు షేక్ కరీమున్  ఆ పార్టీకి రాజీనామా చేసి.. తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ ఇలాకాలోనే వైసీపీకి ఈ పరిణామంతో కోలుకోలేని దెబ్బ తగిలినట్లైంది.  చిలకలూరి పేట ఎమ్మెల్యే , మాజీ మంత్రి   ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో షేక్ కరీమున్  తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.  ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు  మాట్లాడుతూ కరీమున్ చేరికతో చిలకలూరిపేట పట్టణంలో తెలుగుదేశం కూటమి మరింద బలపడిందన్నారు. రానున్న రోజులలో ఆమెకు తెలుగుదేశంలో ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 

కాగా తాను చిలకలూరిపేట పట్టణ సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తెలుగుదేశంలో చేరినట్లు షేక్ కరీమున్ చెప్పారు. . చిలకలూరిపేట పట్టణాభివృద్ధి  ప్రత్తిపాటి పుల్లారావు నాయకత్వంతోనే సాధ్యమవుతుందన్న ఇమె..  నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న మౌలిక వసతుల కల్పన, వినూత్న అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితురాలినై తెలుగుశం గూటికి చేరినట్లు చెప్పారు.  చిలకలూరిపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు.

అలాగే స్థానిక ఎన్నికలలో   విజయానికి   శ్రమిస్తానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల సమరంలో  చిలకలూరి పేట మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉన్న కీలక నాయకురాలు  తెలుగుదేశం గూటికి చేరడంతో వైసీపీ డీలా పడింది.  తాజా పరిణామాలతో చిలకలూరిపేట మున్సిపల్ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఎన్నికల రేసులో ఉన్న కీలక అభ్యర్థి పార్టీ మారడం వల్ల కూటమి బలం గణనీయంగా పెరిగిందని స్థానిక నేతలు భావిస్తున్నారు. 

[Big Shock To YCP Chilakaluripet, YCP Municipal Chairperson, Candidate,Sheik Karimun, Join TDP,  Prathipati Pulla Rao, Chilakaluripet YCP, AP Politics, Telugu One]