TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీమ్ ఇండియాలోకి భువీ ఈజ్ బ్యాక్: నాలుగేళ్ల తరువాత జట్టులోకి.. బుమ్రా గైర్హాజరీతో అవకాశం.!

Published on: Wed Oct 7, 2026 10:42AM

భారత క్రికెట్‌లో ఒకప్పుడు స్వింగ్‌కు మారుపేరుగా నిలిచి, ప్రత్యర్థి బ్యాటర్లను గడగడలాడించిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్  మళ్లీ టీమ్ ఇండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.  దాదాపు నాలుగేళ్ల పాటు జాతీయ జట్టుకు   దూరంగా ఉన్న 36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్.. త్వరలో న్యూజిలాండ్‌తో ఆరంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన 16 మంది సభ్యుల  జట్టులో చోటు దక్కించుకుని సంచలనం సృష్టించాడు. చివరిసారిగా నవంబర్ 2022లో న్యూజిలాండ్‌పైనే భువనేశ్వర్ తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. నాలుగేళ్ల తరువాత మళ్లీ కివీస్‌పైనే ఆడేందుకు జట్టులోకి పునరాగమనం చేయడం విశేషం. 

భువనేశ్వర్ కుమార్ కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించిన తరుణంలో, అతడు దేశవాళి క్రికెట్,  ఐపీఎల్‌లో ప్రదర్శించిన అద్భుతమైన ఫామ్‌తో   సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.   గత రెండు ఐపీఎల్ సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు   తరఫున అద్భుత  ప్రదర్శన కనబరిచిన భువనేశ్వర్, ఆ జట్టు వరుస విజయాల్లో,  టైటిల్ పోరులో కీలక భూమిక పోషించాడు జట్టు వరుసగా ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ క్రమంలో ఆడిన గత 30 ఇన్నింగ్స్‌లలో కలిపి  45 వికెట్లు పడగొట్టి తన  బౌలింగ్ పదును ఇసుమంతైనా  తగ్గలేదని నిరూపించుకున్నాడు.  ఐపీఎల్‌ అనే కాకుండా, కాకుండా, 2026 యూపీ టీ20 లీగ్‌లోనూ భువనేశ్వర్ కుమార్  సత్తా చాటి 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పవర్‌ప్లేలో  ప్రారంభ వికెట్లు అందిస్తూ, డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే భువనేశ్వర్ కుమార్  అనుభవం ప్రస్తుత యువ జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావించిన సెలక్టర్లు సెలెక్టర్లు భావించారు.   

రాబోయే వన్డే సిరీస్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టే ప్రణాళికలో భాగంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. బుమ్రా గైర్హాజరీలో బౌలింగ్ విభాగానికి అనుభవజ్ఞుడైన నాయకత్వం అవసరమైన నేపథ్యంలో, భువీ ఎంట్రీ జట్టు బలాన్ని మరింత పెంచింది.  ఈ రీఎంట్రీతో  వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, కసిగా ఆడితే ఏ దశలోనైనా సరే విజయం సాధించవచ్చని భువనేశ్వర్ కుమార్ నిరూపించాడు. 

[Bhuvneshwar Kumar T20I Comeback, India vs New Zealand, Bhuvi is Back,Swing Master, IPLPerformence, Selectors. Telugu One]