TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విండీస్ తో టి20 సిరీస్: డూ ఆర్ డై మ్యాచ్: స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ కు పిలుపు.!

Published on: Sat Oct 17, 2026 10:48AM

వెస్టిండీస్ తో జరుగుతున్న ఐదు టి20ల సిరీస్ లో కీలకమైన ఐదో మ్యాచ్ ఈ రోజు బెంగళూరు వేదికగా జరగనుంది. సిరీస్ లో ఇరు జట్లూ 2-2తో సమానంగా ఉండటంతో సీరిస్ డిసైడర్ అయిన ఐదో మ్యాచ్ గెలిచి తీరాలన్న పట్టుదలతో రెండు జట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా స్ట్రైక్ బౌలర్ అర్షదీప్ గాయంతో వైదొలగడంతో టీమ్ ఇండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ను జట్టులోకి తీసుకుంది.   నిర్ణయాత్మకమైన ఐదో టీ20 మ్యాచ్ కోసం సెలక్టర్లు అకస్మాత్తుగా జట్టులో ఈ మార్పు చేయడం క్రీడావర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్  గాయపడటంతో..  వైద్య బృందం సలహా మేరకు అతనికి విశ్రాంతినివ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ సిరీస్‌లో జట్టు విజయావకాశాలను దెబ్బతీయకుండా పదునైన పేస్ దాడిని కొనసాగించేందుకు, అనుభవానికి పెద్దపీట వేస్తూ సెలక్టర్లు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను స్క్వాడ్‌లోకి తీసుకువచ్చారు.

నాలుగేళ్ల విరామం తరువాత  భువనేశ్వర్ కుమార్ కు టీమ్ ఇండియాలోకి ఎంట్రీ దక్కింది. డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడంలో, అలాగే పవర్‌ప్లేలో వికెట్లు తీయడంలో దిట్టగా గుర్తింపు పొందిన భువనేశ్వర్ కుమార్ ఎంట్రీ జట్టుకు ఉపయోగపడుతుందని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తున్నది.   ఫిట్‌నెస్ నిరూపించుకుని నాలుగేళ్ల తరువాత టీమ్ ఇండియాలోకి  రీఎంట్రీ ఇస్తున్న భువి చేరికతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా మారుతుందనడంలో సందేహం లేదు.   

[Bhuvneshwar Kumar Replace Injured  Arshdeep Singh, India vs West Indies 5th T20, Team India Squad, Swing King, Series Decider Match, Telugu One]