TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాలుడి కిడ్నాప్ హత్య.. బెంగళూరు టెక్కీ దారుణం.!

Published on: Sat Sep 19, 2026 10:20AM

బెంగళూరులో బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఓ టెక్కీ ఉదంతమింది. డబ్బు కోసం పొరుగింటిలోకి ఓ బాలుడిని కిడ్నాప్ చేయడమే కాకుండా దారుణంగా హత్య చేసి కారు డిక్కీలో ఉంచి.. మృతదేహాన్ని మాయం చేయడానికి వెడుతుండగా వరుస ప్రమాదాలు చేసి అడ్డంగా దొరికిపోయిన సంఘటన బెంగళూరులో జరిగింది. వివనాలిలా ఉన్నాయి. బెంగళూరులోని యలహంక వినాయక నగర్‌కు చెందిన 13 ఏళ్ల ప్రైవల్ అనే బాలుడిని అతడి పక్క ఇళ్లలో ఉండే భాస్కర్ రెడ్డి అనే టెక్కీ కిడ్నాప్ చేశాడు. బాధితుడు ప్రైవల్ తండ్రి మనోహర్ రియల్ ఎస్టేట్,  ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. కాగా బాలుడికి కార్లు అంటే ఉన్న మోజును అవకాశంగా తీసుకుని  నిందితుడు భాస్కర్ రెడ్డి, కార్లలో తిరుగుదాం, టపాసులు కొనుక్కుందాం అంటూ నమ్మించి బాలుడిని తన కారులోకి ఎక్కించుకున్నాడు. 

ఆ తర్వాత   నిందితుడు బాలుడితో బలవంతంగా ఒక వీడియో రికార్డ్ చేయించి, అతడి తండ్రికి రూ. 1 కోటి డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు.  దీంతో  కంగుతిన్న బాలుడి కుటుంబ సభ్యులు వెంటనే నిందితుడి తండ్రిని సంప్రదించి నిలదీశారు. అంతే కాకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. తన ప్లాన్ బెడిసికొట్టిందని అర్ధం చేసుకున్న నిందితుడు భాస్కరరెడ్డి..  బాలుడు ఎక్కడ తన బండారం బయటపెడతాడోనన్న భయంతో కారులోనే సిమెంట్ ఇటుకతో ప్రైవల్ తలపై బలంగా బాది దారుణంగా హత్య చేశాడు.   బాలుడి మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి..   ఆంధ్రప్రదేశ్ వైపు పరారయ్యేందుకు ప్లాన్ వేసుకున్నాడు.

అయితే మద్యం మత్తులో ఉన్న భాస్కరరెడ్డి..  బళ్లారి  సర్వీసు రోడ్డు వద్ద  కారుపై నియంత్రణ కోల్పోయి పలు వాహనాలను ఢీకొట్టారు.   దీంతో అక్కడ ప్రయాణికులు, ప్రజలు అప్రమత్తమై  కారును అడ్డుకున్నారు.   అదే సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న చిక్కజాల పోలీసులు కారును  తనిఖీ చేయడంతో  డిక్కీలో బాలుడి మృతదేహం బయటపడింది.  తొలుత  ఎవరో యాక్సిడెంట్‌లో చనిపోతే హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నానని బుకాయించేందుకు ప్రయత్నించిన భాస్కర్ రెడ్డి. పోలీసుల  విచారణలో అసలు నిజం ఒప్పుకున్నాడు.  భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


[bhaskar reddy arrest,Bengaluru Crime, Boy Kidnap Murdered, Chikkajala Police, Prajwal Death, Telugu One]