TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీజ్ చేసిన సరుకును దొడ్డి దారిన అమ్మేసిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్.!

Published on: Fri Sep 4, 2026 2:27PM

అటవీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎన్. వెంకటరమణపై ప్రభుత్వం  సస్పెన్షన్ వేటు వేసింది. ప్రభుత్వ అధికారులకే తలవంపులు తెచ్చేలా.. ఆయన అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో  ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేసింది.  విధుల్లో భాగంగా గతంలో అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న అక్రమ సిగరెట్ల స్టాక్‌ను ఆయన అమ్మేసి సొమ్ము చేసుకున్నారని తేలింది.  అనుమతులు లేకుండా, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా సీజ్ చేసిన వస్తువులను రహస్యంగా విక్రయించారనే ఆరోపణలు రుజువు కావడంతో వెంకటరమణను ప్రభుత్వం సస్సెండ్ చేసింది. 

 రేంజ్ ఆఫీసర్ హోదాలో ఉండి కూడా.. వెంటరమరణ సీజ్ చేసిన స్టాక్ ను విక్రయించిన ఘటన  అటవీశాఖలో తీవ్ర కలకలం రేపింది. నిబంధనల ప్రకారం దాడుల్లో పట్టుబడిన   సరుకైనా నిర్దిష్టమైన చట్టపరమైన ప్రక్రియ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేర్చాలి లేదా ఉన్నతాధికారుల సమక్షంలో ధ్వంసం చేయాలి. అయితే..  ఇందుకు విరుద్ధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకట రమణ,  సొంత ప్రయోజనాల కోసం స్టాక్‌ను  అమ్మేసినట్లు రజువైంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న  ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. 50 లక్షల విలువైన నిషేధిత సిగరెట్ల స్టాక్ ను వెంకటరమణ దొడ్డిదారిన అమ్మేసినట్లు విచారణలో తేలింది.   ఈ వ్యవహారంలో కేవలం ఒక్క రేంజ్ ఆఫీసర్ కు కింది స్థాయి సిబ్బంది, అధికారుల హస్తం కూడా ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.  

[Bhakarapeta Forest Range Officer,  Venkataramana suspended; seized cigarettes Sold, Forest Department  action; Tirupati District forest, Telugu One]