TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ టు ఆటో డ్రైవర్: అమ్మ కోసం కెరీర్ త్యాగం చేసిన యువతి.!

Published on: Tue Sep 29, 2026 4:21PM

లక్షల్లో వేతనం వచ్చే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కెరీర్ ను తృణ ప్రాయంగా వదిలేసి.. ఆటో డ్రైవర్ అవతారమెత్తిన యువతి ఉదంతమింది. ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక హృదయాన్ని కదిలించే, కళ్లు చెమ్మగిల్లేలా చేసే మానవీయ కోణం ఉంది. జన్మనిచ్చిన తల్లి కోసం ఉజ్వల భవిష్యత్ ఉన్న కెరీర్ ను వదిలేసి, పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని అందరి మన్ననలు పొందుతున్న ఆ యువతిది బెంగళూరు. 

వివరాల్లోకి వెడితే.. సాఫ్ట్ వేర్ రగంలో ప్రశాంత వాతావరణంలో, లగ్జూరియస్ గా బతకడానికి అవసరమైనంత వేతనం వచ్చే కొలువును ఆ యువతి తృణ ప్రాయంగా త్యజించడానికి కారణం.. నైట్ షిఫ్టులు అధికంగా ఉండే కొలువులో కొనసాగడం వల్ల తల్లిని బాగా చూసుకోలేనన్న సంశయమే కారణం. హాయిగా సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ చేస్తున్న ఆ యువతి, తండ్రి హఠాన్మరణంతో డిప్రషన్ లోకి వెళ్లిపోయిన తన తల్లికి తానే తల్లిగా మారి అపురూపంగా చూసుకోవాలని నిర్ణయించుకుంది.

అందుకు తాను చేస్తున్న ఉద్యోగం అడ్డుగా నిలుస్తుందని భావించింది. నైట్ షిప్టులు చేయడం వల్ల తల్లని చూసుకోవడం కష్టంగా మారుతుందని భావించింది. అందుకే క్షణం ఆలోచించకుండా బంగారం లాంటి ఉద్యోగాన్ని వదిలేసింది. పురుషాధిక్యత అధికంగా ఉండే ఆటో రంగంలోకి ప్రవేశించింది. ర్యాపిడో ఆటో డ్రైవర్ గా మారింది. సమాజం ఏమనుకుంటుంది అన్న ఆలోచనను దరి చేరనీయకుండా, ఇంట్లో వారి అభ్యంతరాలను లెక్క చేయకుండా   శిక్షణ తీసుకుంది.

 ఈ వివరాలన్నీ ఓ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ ఆమె ఆటో ఎక్కడంతో వెలుగులోకి వచ్చాయి. ఆ యువతి ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె ఫ్లుయెంట్ ఇంగ్లీష్ మాట్లాడటంతో.. ఆ కంటెంట్ రైటర్ వివరాలు కనుక్కుంది.  రాత్రివేళల్లో ఇంటి పట్టున  ఉంటూ తల్లిని కనిపెట్టుకునే వెసులుబాటు ఉంటుంది కనుకనే ఈ వృత్తిని ఎంచుకున్నానంటూ ఆ యువతి చెప్పిన సమాధానం నెట్టింట కోట్లాది మంది హృదయాలను హత్తుకుంది.

 ఆ కంటెంట్ క్రియేటర్  ద్వారా సోషల్ మీడియాలో సాఫ్ట్ వేర్ జాబ్ నుంచి ఆటో డ్రైవింగ్ లోకి మారిన యువతి ఉదంతం తెగ వైరల్ అయ్యింది.  తల్లికోసం నిలబడిన ఆ యువతి తెగువను నెటిజనులు మనస్ఫూర్తిగా ప్రస్తుతిస్తున్నారు సామాజిక కట్టుబాట్లు, ఇతరుల విమర్శలను లెక్కచేయకుండా కన్న తల్లికే అమ్మగా మారి అపురూపంగా చూసుకోవడం కోసం కెరీర్ ను త్యాగం చేసిన ఈ మాజీ ఐటీ ఉద్యోగినిపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.  

[Bengaluru Woman, Softwere Employee,  Auto Driver, Rapido Auto Driver, Former IT Employee Auto Driver, Woman Empowerment, Telugu One]